-రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండుగులా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..
-హోమ్ శాఖ మంత్రి డా.తానేటి వనిత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి వారికు ఆర్థిక భరోసాను కల్పిస్తూ చేయూతను అందిస్తోందని రాష్ట్ర హోం విపత్తులు నిర్వహణ శాఖ మంత్రి డా.తానేటి వనిత అన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన డా. వై.యస్.ఆర్ యంత్ర సేవా పథకంలో భాగంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా గుంటూరు నుండి ప్రారంభించి, బటన్ నొక్కి డిబిటి పద్దతిలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈ సందర్భంగా స్థానిక మార్గాని ఎస్టేట్ – మోరంపూడి వద్ద ఏర్పాటు చేసిన వై ఎస్ ఆర్ యంత్ర సేవా పథకంను మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత, ఎంపీ మార్గాని భరత్ రామ్ ,శాసనసభ్యులు జక్కంపూడి రాజా ,తలారి వెంకట్రావు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల సమక్షంలో ప్రారంభించి లబ్ధిదారులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన హోమ్ మంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ, ఈరోజు రైతన్నలకు పండగ రోజు అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అన్నారని, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయం పండుగగా జరుపుకునేలా చేశారన్నారు. గతంలో ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉంటే, ఈరోజు ప్రతి గ్రామంలో ఆర్భికే లు ఏర్పాటు చేసి, వ్యవసాయ సిబ్బందిని నియమించా మన్నారు. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందుబాటులో ఉండడమే కాకుండా వ్యవసాయం లో మెళుకువలు రైతులకు అన్ని వేళల ఆర్ బి కే ల ద్వారా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా రన్నారు. రైతులందరికీ వ్యవసాయం లాభసాటిగా ఎలా చేసుకోవాలి, ఏ పంట వెయ్యాలో అధికారులు అడుగడుగునా అండగా ఉండడం మనం నేడు చూస్తున్నాము. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ, అన్ని వేళలాఈ ప్రభుత్వం అండగా నిలవడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సిహెచ్ సి లబ్దిదారులకు అర్భికే ద్వారా 3800 ట్రాక్టర్లు, 1140 ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలు 320 హార్వెస్టింగ్ మిషన్లను 590 కోట్లు విలువైన యంత్ర పరికరాలను 40 శాతం సబ్సిడీ గా175 కోట్లను అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్ రెడ్డిగారిదే అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి వారి ఆర్థిక అభివృద్ధికి చేయూత అందిస్తుందన్నారు. అవినీతి లేకుండా రైతులకు కావలసిన కంపెనీ ట్రాక్టర్ ఎంపిక చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. రైతుకు నచ్చిన ఏ కంపెనీ ట్రాక్టర్లు కావాలంటే ఆ కంపెనీ ట్రాక్టర్లు తీసుకోవచ్చని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 166 మంది సి హెచ్ సి లబ్ధిదారులకు 40 శాతం సబ్సిడీగా రూ. 691.74 కోట్లు ప్రభుత్వం రైతులకు అందించిన అన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందించిన ఈ యంత్ర పరికరాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సభకు అధ్యక్షత వహించిన శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ యంత్ర పరికరాలు 40 శాతం సబ్సిడీతో అందించడం జరుగుతోందన్నారు. విత్తనాలు నుంచి ఎరువుల వరకు ప్రతి అడుగులో తండ్రికి మించిన తనయుడు గా జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ముందుంటున్నారని పేర్కొన్నారు.
గోపాలపురం ఎం ఎల్ ఏ తలారి వెంకట్రావు జూన్ ఒకటినే సాగునీరు అందించే క్రమంలో రైతులకు అండగా నిలిచిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. గతప్రభుత్వం బకాయి ఉంచిన రూ.1800 కోట్ల బకాయిలు నేడు జగనన్న ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్నారు.
చల్లా శ్రీను రైతు…
రంగంపేట మండలం, వడిశలేరు కు చెందిన రైతు చల్లా శ్రీను మాట్లాడుతూ, గతంలో సెనగ పంటకు రైతు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడే వారమని, నేడు రైతు నుంచి క్వింటాలు రూ.5,500 లకు సెనగ కొనుగోలు చేసి రైతుకి ఈ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తాను కౌలుకు 40 ఎకరాలు భూమి సాగు చేస్తానన్నానని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ రైతుకు అన్నీ యంత్ర పరికరాలు సమకూర్చు తున్నారన్నారు. రైతు క్షేమం కోరుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. గతంలో వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్ లు కావాలంటే అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, నేడు పేద రైతు కూడా వ్యవసాయ పరికరాలు ఎటువంటి సిఫార్సు లేకుండా పొందగలుగుతున్నట్లు తెలిపారు.
నియోజకవర్గాల వారి…
అనపర్తి నియోజకవర్గం లో 42 మంది సి హెచ్ సి లబ్ధిదారులకు రూ.147.02 లక్షలు సబ్సిడీని అందించాగా, గోపాలపురం నియోజకవర్గం లో 22 మంది సి హెచ్ సి లబ్ధిదారులకురూ. 94.53 లక్షలు సబ్సిడీ, జగ్గంపేట నియోజకవర్గం లో 11 మంది సి హెచ్ సి లబ్ధిదారులకురూ. 43.63 లక్షలు సబ్సిడీ, కొవ్వూరు నియోజకవర్గం లో 16 మంది సి హెచ్ సి లబ్ధిదారులకు రూ. 83.35 లక్షలు సబ్సిడీ, నిడదవోలు నియోజకవర్గం లో 21 మంది సి హెచ్ సి లబ్ధిదారులకు రూ. 96.62 లక్షలు సబ్సిడీ, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం లో 11 మంది సి హెచ్ సి లబ్ధిదారులకు రూ. 48.19 లక్షలు సబ్సిడీ, రాజానగరం నియోజకవర్గం లో 43 మంది సి హెచ్ సి లబ్ధిదారులకు రూ. 178.40 లక్షలు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
జిల్లాలో వ్యవసాయ యంత్ర పరికరాలు పనిముట్లు నిమిత్తం 166 సి.హెచ్.సీ. లకు మొత్తం ప్రభుత్వ సబ్సిడీగా రూ.691.74 లక్షలు అందించడం జరిగింది. మొత్తం జిల్లాలో 31 హార్వెస్టింగ్ వ్యవసాయ యంత్ర పరికరాలు, 100 ట్రాక్టర్ల పంపిణీ చేసే మెగామేళా ని ఏర్పాటు చేయగా అందులో భాగంగా రూ.1,729.35 లక్షలు మేర ప్రయోజనం రైతులకు సమకూరనుంది. ఇందులో రైతులు వాటాగా 10 శాతం, ప్రభుత్వ సబ్సిడీ గా 40 శాతం, బ్యాంకు రుణంగా 50 శాతం మేర ప్రయోజనం కలుగనుంది.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, వైయస్సార్ సిపి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు , ఆర్డీవో ఏ. చైత్ర వర్షిని , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News