దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తోపుడు బండి వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలకు అతీతంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడలో ఆపదలో అవసరార్ధం ఉన్న నిరుపేదలకు విద్య,ఉపాధి, వైద్య రంగాలలో అండగా నిలుస్తు నేడు 13వ డివిజన్ల నిరుపేద కుటుంబాలకు చెందిన పల్లి నాగ మహా లక్ష్మి కి తోపుడు బండి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని 13వ డివిజన్ వైస్సార్సీపీ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్ అన్నారు. అద్దె బండి తో వారి జీవనోపాధి కొరకు కష్ట పడుతున్న విషయం అవినాష్ కి చెప్పగా ఆయన వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 20 వేల రూపాయల విలువ గల తోపుడు బండిని సోమవారం నాడు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బట్టరాజు సంఘం చైర్మన్ గీతాంజలి,కోలా ఉమా, ఊకోటి రమేష్, గోవర్దన్, చిమటా బుజ్జి, పల్లి రమేష్, పిడుగు విజయ్, శ్రీను మరియు డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *