ఉధృత అతిసార నియంత్రణ పక్షోత్సవాలు…


రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉధృత అతిసార నియంత్రణ పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సోమవారం PHC సీతానగరం డాక్టర్ చైతన్య  Mulakallanka sector సందర్శించుట జరిగినది ఈ కార్యక్రమం గురించి డాక్టర్ AVK. చైతన్య  వివరిస్తూ ఈ కార్యక్రమం ఈనెల 13-6 -2022 నుండి 27- 6- 2022 వరకు జరుగుతుందని తెలియజేయుట జరిగినది .ORS మరియు జింకు మాత్రలు ఇవ్వడం ద్వారా విరోచనాలు అరికట్టవచ్చు అని సూచించారు విరోచనాలు సమయంలో మరియు విరోచనాలు అనంతరం ORS ద్రావణం మరియు ఇతర అనుబంధ ఆహారం ఇవ్వాలని ,మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తెలియజేశారు .ఆహారం తినిపించే ముందు వంట చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని తెలియజేశారు .ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు విరోచనాలు సమయంలో ORS ద్రావణం తో పాటు నిర్దేశించిన మోతాదుల 14 రోజులు Zinc Tablets తగిన మోతాదులో ఇవ్వాలని తెలియజేశారు Mulakallanka sector నందు ఏర్పాటు చేసిన ORS Zinc corner సందర్శించి తగిన సూచనలు ఇవ్వడం జరిగినది తర్వాత అతిసార నియంత్రణకు సంబంధించిన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ చైతన్య తో పాటుగా హెల్త్ సూపర్వైజర్ K. శ్రీనివాసరావు, S. సూర్యకుమారి మరియు హెల్త్ అసిస్టెంట్స్,ఎల్ ANMలు , MLHP లు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *