రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ఫిర్యాదు పరిష్కారంలో వార్డు కార్యదర్శులు నిబద్దతతో పనిచేయాలని అదనపు కమిషనర్ పి ఎం సత్యవేణి పేర్కొన్నారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయం లో ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా పి ఎం సత్యవేణి మాట్లాడుతూ, ప్రజలు అందచేసే ప్రతి ఫిర్యాదును నిర్ణీత సమయం లోగా పరిష్కారం చూపాలన్నారు. స్పందనలో మరల మరల వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కారం కోసం గత వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని , అయినా ఇంకా రెండు మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. శానిటేషన్ కార్యదర్శి, ఏమినిటీ కార్యదర్సులు ఇద్దరూ సమన్వయం చేస్తూ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాలన్నారు. సాంకేతిక పరమైనవా, న్యాయ సంబంధ పరమైనావా గుర్తించాలన్నారు. వారి పరిధిలో పరిష్కారం కానీ పక్షంలో ఉన్నతాధికారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. తమ పరిధి లోనిది కాదని అనకుండా శానిటరీ , ఇంజనీరింగ్ వారు కలిసి సమస్య పరిష్కారం చూపి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్త శుద్ధితో పనిచేస్తూ, తమ సమస్యలకు ప్రభుత్వ అధికారులు తప్పక పరిష్కారం చూపుతారని ప్రజలు అనుకునే విధంగా పనితీరు చూపాలని సత్యవేణి అన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ జీ. పాండురంగ రావు, చీఫ్ ప్లానింగ్ అధికారి జె. సూరజ్ కుమార్, వార్డు కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News