-జిల్లా కలెక్టర్ స్పందన లో అర్హత కలిగిన వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును వెంటనే పరిష్కారం చూపాలి
– కలెక్టరేట్ ఏ ఓ .. కే. శ్రీనివాసరావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదును మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత కాల పరిమితి లో పరిష్కారం చూపాలని పరిపాలనాధికారి కె. శ్రీనివాస రావు తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఏవో జీ.భీమారావు తో కలిసి శ్రీనివాసరావు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టరేట్ పరిపాలనాధికారి కే. శ్రీనివాస రావు మాట్లాడుతూ, సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 144 మంది స్పందన కార్యక్రమానికి హాజరై ఫిర్యాదులను అందచేశారన్నారు. రెవెన్యూ, డిఆర్డిఏ, హౌసింగ్, హెల్త్, వికలాంగుల సంక్షేమ శాఖ, బ్యాంకు రుణాలు, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు వంటి వాటిపై ఫిర్యాదులు అందాయన్నారు. ఈ స్పందన కార్యక్రమం లో జిల్లా లోని రెండవ స్థాయి అధికారులు పాల్గొన్నారు. అనపర్తి కి చెందిన దివ్యాంగులు ఎన్. సురేష్ మోటార్ ట్రై సైకిల్ కోసం, మిర్తిపాడు కి చెందిన జే. భాస్కర్ చౌదరి కిడ్నీ చికిత్స కోసం, కొవ్వురుపాడు కి చెందిన వి.భగవతి ఆ విషయం పై ఫిర్యాదు లను అందచేశారు.
Prajavartha Online Telugu News