వికాస జాబ్ మేళా కి హాజరైన 30 మంది

-ఐదు కంపెనీల్లో ఉద్యోగాలకు పొందిన 21 మంది అభ్యర్థులు
– కలెక్టర్ డా.కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరెట్ లో సోమవారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో “వికాస ” వారిఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తెలియచేశారు. సోమవారం ఉదయం నుంచి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వికాస్ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రవేటు కంపెనీ లు ఔత్సహిక యువతి యువకులకు ఇంటర్వూలను నిర్వహించడం జరిగింది కలెక్టర్ డా. మాధవీలత ఒక ప్రకటన విడుదల చేస్తూ సోమవారం వికాస్ వారి ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా 30 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 21 మంది ఇంటర్వూ ల అనంతరం అయా కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత పొంది నియామక పత్రాలను కంపెనీ ప్రతినిధులు అందచేశారు. వికాస – కలెక్టరేట్‌లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కి సోమవారం మొత్తం 30 మంది అభ్యర్థులు హాజరవ్వగా 21 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు. షాషార్ట్ లిస్టు లో ఉన్న 21 మంది అభ్యర్దులు కంపెనీ వారీగా హ్యుందాయ్ మోబిస్ 2, ఇండిగో లో ఒకరికి, కాజెంట్ 8, హెచ్ డి ఎఫ్ సి లో 6 మంది, స్పెన్సర్ లో 4 గురు అభ్యర్థులు ఉద్యోగాలను పొందినట్లు ఆమె తెలియచేశారు. ఈ జాబ్ మేళా ను వికాస్ జిల్లా మేనేజర్ కొండూరి శర్మ, రాజమహేంద్రవరం రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ లు, కంపెనీ ప్రతినిధులతో సమన్వయంచేసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *