రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు సమాజంలో దివ్యాంగులు కొద్దిపాటి చేయూతను అందించినా వారి కాలుపై వారు నిలబడి మరో నలుగురికి స్ఫూర్తి ని ఇస్తున్నారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. సోమవారం రాజానగరం లో నిర్వహించిన స్పందన కార్యక్రమం అనంతరం విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో దివ్యంగులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత స్థానిక శాసన సభ్యులు జక్కంపూడి రాజా
ట్రై సైకిల్స్ అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు సమాజంలో వారి అభివృద్ధి నీ కాంక్షిస్తూ వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు అర్హులైన అందరూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఈ సందర్భంగా ఆకుల రామకృష్ణ, గోకవరం, సలాది అన్నవరం, కొత్తపల్లి గ్రామం, గోకవరం మండలంకు చెందిన ఇద్దరికి, రాజానగరం మండలం చెందిన బాలు అనే విద్యార్థికి రూ.6,500 లు ఖరీదు చేసే ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా, అసిస్టెంట్ డైరెక్టర్ , శ్రీ వి. కామరాజు, డైరెక్టర్, & బి. నాగ భూషణం లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News