తొలిరోజు వైద్య పరీక్షలు నిర్వహించిన కార్డియాలజిస్ట్ డా.అశోక్; ఎండోక్రైనాలజిస్ట్ డా. శేఖర్ రెడ్డి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా సూపర్ స్పెషలిస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మ.2 నుంచి సా.4 గం. అందుబాటులో ఉండి ఓపి సేవలు అందిస్తారు. సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులు స్పెషలిస్టులు ఈరోజు నుంచి అందుబాటులో తీసుకొస్తున్నామని జిల్లా కలెక్టర్ మాధవి లత తెలిపారు.

సోమవారం జిల్లా ఆస్పత్రి లో సూపర్ స్పెషాలిటీ ఓ పి విభాగాన్ని శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తో కలిసి కలెక్టర్ డా.మాధవీలత ప్రారంభించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రజలకు డాక్టర్ల సేవలు దగ్గరకు చేయాలని లక్ష్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ వైద్యులతో మాట్లాడి వారంలో ఆరు రోజులు పాటు సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆయా విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు అవుట్ పేషెంట్లు కి వైద్య సేవలు అందిస్తారన్నారు. తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుంచి ప్రతి నిత్యం ప్రజలు వైద్య సేవలు కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతోందన్నారు. ఈ విషయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లతో మాట్లాడడం జరిగిందని, నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లా లోని ప్రజలకు రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందించేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం తో ప్రజల ఆరోగ్యం కోసం ముందుకు రావడం వారి ప్రవేటు ప్రాక్టీసును కూడా వదులుకొని ప్రతిరోజు రెండు గంటల పాటు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమకూర్చుకున్న అత్యాధునిక వైద్య పరికరాలను వినియోగించి ప్రభుత్వాసుపత్రికి వోచ్చే రోగులకు సేవలందించాలని కోరామన్నారు. ఈ తరహా వైద్య సేవలను భవిష్యత్తులో కూడా కొనసాగించేలాగా చర్యలు తీసుకుంటామని మాధవీలత తెలిపారు.

శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , జిల్లాలో సిహెచ్.సిలు, ఒకమెడికల్ కళాశాల ఉండాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయించి వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నారన్నారు. 1978 వ సంవత్సరంలో 250 పడకల తో జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.ఈరోజు కలెక్టర్ చొరవతో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల సేవలను కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని శాసనసభ్యులు జక్కంపూడి రాజా తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్యతో వచ్చినా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్యులను ప్రైవేట్ ఆసుపత్రులతో మాట్లాడి అందుబాటులో తీసుకొస్తున్నామని తెలిపారు.

రోజువారి సూపర్ స్పెషలిస్ట్ ఓపి వివరాలు ..

సోమవారం.. ఎండోక్రైనాలజిస్ట్;
మంగళవారం..యూరాలజిస్ట్;
బుధవారం..నెఫ్రాలజిస్ట్;
గురువారం..కార్డియాలజిస్ట్;
శుక్రవారం..న్యూరో సర్జరీ;
శనివారం..న్యూరాలజిస్ట్ విభాగాలకు చెందిన సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారు.

సూపర్ స్పెషాలిటీ వైద్యుల వివరాలు..

ఎండోక్రైనాలజిస్ట్ వైద్యులు..
డా. శేఖర్ రెడ్డి; కార్డియాలజిస్ట్ .. డా. సత్యేంద్ర కుమార్;

యురాలజిస్టు .. డా.అమరేంద్ర;న్యూరాలజిస్ట్.. డా.రవిరామ్ కిరణ్; డా.గీతారెడ్డి;

నెఫ్రాలజిస్ట్.. డా.ప్రదీప్;

కార్డియాలజిస్ట్ ..డా.అశోక్;
గ్యాస్ట్రోజిలిస్ట్.. డా. వరుణ్ రెడ్డి; డా.స్వపనిక;

న్యూరో సర్జరీ .. డా.గౌతమ్ శ్రవణ్ ;

న్యూరాలజిస్టు.. డా. రాజ్యలక్ష్మి లు
సూపర్ స్పెషాలిటీ వైద్యులుగా అందుబాటులో ఉంటారు.

కార్యక్రమంలో డి ఎమ్ & హెచ్ ఓ డా. ఆర్ స్వర్ణలత, డి సి హెచ్ డాక్టర్ సనత్ కుమార్ హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ బి.ఎస్ కుమార్, సభ్యులు గురు ప్రసాద్ మార్గాని రాము ఐ ఎమ్ ఐ ప్రతినిధులు , ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *