రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ వారంలో ఓ టి ఎస్, గృహాల గ్రౌండింగ్ పనులు లక్ష్యాల మేరకు సాధించడంలో వెనుకబడి ఉన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రెవెన్యూ హౌసింగ్ పంచాయతీ రాజ్ ఇతర సమన్వయ శాఖలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓ టి ఎస్ లక్ష్యాలను సాధించడంలో క్షేత్రస్థాయిలో సిబ్బందికి లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని అయితే వాటిని సాధించడంలో అనుకున్న స్థాయిలో పురోగతి లేదన్నారు. రాజమండ్రి , కొవ్వూరు ఆర్డీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు నిర్దిష్టమైన లేఅవుట్లలో పనులను చేపట్టేందుకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఆయా లే అవుట్ పనుల పురోగతి పై ప్రత్యేకంగా సంబంధిత అధికారులతో నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే మండల స్థాయి అధికారులకు నిర్దేశించిన ఓ టి ఎస్, జగనన్న కాలనీల్లో పేదలందరికీ ఇల్లు నిర్మాణంపై మంగళవారం సాయంత్రం కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి నందున, మిగతా అధికారుల పనితీరును సమీక్షిస్తామన్నారు. మిగిలిన ఆర్డీవోలు మున్సిపల్ కమిషనర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష చేస్తానన్నారు. ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటి వరకు పూర్తి అన్ని పనులు సంబంధించి చెల్లింపులు కోసం బిల్స్అప్లోడ్ పూర్తి చేయాలని , అదేవిధంగా సమస్యత్మకంగా ఉన్న గ్యాప్స్ ను అధిగమించాల్సి ఉందని కలెక్టర్ మాధవిలత అన్నారు. లే అవుట్ లలో చేసే పనుల కోసం నిధులు మంజూరయ్యాయి కావున వాటిని పూర్తి చేసే బాధ్యత మీదే నని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తానని, పనులలో జాప్యానికి ఈఈ లు, డి ఈ లు, ఏ ఈ లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నారు.
జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటిఎస్ కు సంబంధించి 3,065 డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయని వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈరోజు పంచాయతీ కార్యదర్శులు చేత ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీ లు ప్రత్యేక దృష్టి పెట్టి ఓ టి ఎస్ సంబంధించిన పనులను మాత్రమే పూర్తి చేయాలన్నారు. కార్యదర్శులు వాలంటిర్స్ తో సమన్వయం చేసుకుంటూ, ఈరోజు రాత్రి కి లక్ష్యాలను సాధించడానికి పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Prajavartha Online Telugu News