-అమృత్ సర్ కార్పోరేషన్ కార్యాలయ అధికారులతో బేటి అయిన విజయవాడ కార్పోరేటర్ల బృందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో భాగంగా సోమవారం కార్పొరేటర్ల బృందం అమృత్ సర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ దీపేందర్ సింగ్ మరియు ఇతర అధికారులతో బేటి అయ్యారు. ఈ సందర్భంలో అమృత్ సర్ నందు నిర్వహిస్తున్న పలు ప్రాజెక్ట్ లతో పాటుగా మల్టీ లెవల్ పార్కింగ్ నిర్వహణ, పార్కుల అభివృద్ధి, అత్యవసర కాల్ సిస్టమ్ వంటి స్మార్ట్ సిటీ కార్యకలాపాల గురించి పవర్ పాయింట్ ద్వారా వివరించారు. అదే విధంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో పలు ప్రాజెక్ట్ లను పొందుతున్నట్లు తెలియజేసారు. తదుపరి సదరు బృందం నగరంలోని పలు ప్రాజెక్ట్ ల నిర్వహణ, వాటి పనితీరు మరియు మల్టీ లెవల్ పార్కింగ్ నిర్వహణకు సంబందించిన విధివిధానములను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.
Prajavartha Online Telugu News