-కలెక్టర్ మాధవిలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 28 కేంద్రాలలో క్రీడా ప్రాధికారిత సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె మాధవి లత తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో క్రీడా పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరక దృఢత్వాన్ని పెంచడానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదువులతో పాటుగా క్రీడల్లో కూడా రాణించి వారి ప్రతిభను చాటుకునేందుకు ఇటువంటి సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 28 కేంద్రాలలో సమ్మర్ క్యాంపులను నిర్వహించేందుకు , పాల్గొన్న వారికి సర్టిఫికేట్ లు జారీ కోసం రూ.5 వేలు చొప్పున రూ.1.40 లక్షలు నిధులను రాష్ట్ర క్రీడా సాధికారిత సంస్థ విడుదల చేయడం జరిగిందన్నారు. మే 4 నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకాఆసక్తి ఉన్నవారు రెగ్యులర్క్యాంపులకు వెళ్లి కోచ్లను సంప్రదించవచ్చునని తెలిపారు. మే క్యాంపు నందు సుమారు వెయ్యి మంది కి పైగా యువత సమ్మర్ క్యాంపు ద్వారా శిక్షణ పొందినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడా పరికరాలను, సర్టిఫికేట్ లను ఆయా క్రీడా కేంద్రాల సిబ్బందికి కలెక్టర్ అంద చేయడం జరిగింది. కలెక్టర్ సమక్షంలో సమ్మర్ క్యాంప్ లను రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల లో అథ్లెటిక్ అంశం, రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల , ఎస్ కె వి టి కళాశాల, ఎపి పేపర్ మిల్స్ మల్లయ్య పేట లో బాస్కెట్ బాల్ , రాజమండ్రి ఎస్ కె వి టి కళాశాల, కడియం జెడ్పీ హెచ్ఎస్ లో ఫుట్ బాల్, రాజమండ్రి ఎస్ కె వి టి డిగ్రీ కళాశాలలో హ్యాండ్ బాల్, గౌతమి ఘాట్ (ఇస్కాన్ టెంపుల్ దగ్గర) , కడియం జెడ్పీ హెచ్ఎస్ లో జూడో , పోలమూరు జెడ్పీ హెచ్ఎస్ లో వాలీబాల్, దూబచేర్ల జెడ్పీ హెచ్ఎస్ లో యోగా అంశంల వారికి ద్రువపత్రలు అందచేశారు. అన్ని కేంద్రాలకు ద్రువపత్రాలను అందచేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ఔత్సాహిక యువత ఆయా క్యాంపు నిర్వాహకులను కలిసి రెగ్యులర్ గా జరిగే అంశాలలో శిక్షణ పొందేందకు అవకాశం ఉందని కోచ్ శేషగిరి తెలిపారు. ఉదయం 5.30 నుంచి 7.30 వరకు, సాయంత్రం 5 నుంచి ఈ సమ్మర్ క్యాంప్ లలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. బంగ్లా ఈ సందర్భంగా గా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్న కోచ్ లతో, వాలంటీర్లు తో కలెక్టర్ మాధవుల తో మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ కు ఎంతమంది హాజరవుతున్నారు, వారిలో ప్రతిభ కలవాలి గుర్తించారా, భవిష్యత్ కార్యాచరణకు ఏమేమి ప్రతిపాదనలు చేస్తారని వివరాలు అడిగారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల ప్రధాన కోచ్ బి ఎమ్ ఎమ్ శేషగిరి క్యాంపు ఇంఛార్జి శిక్షకుడు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News