అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళగిరి ఇందిరా నగర్ మూడు పంపుల సెంటర్ వద్ద నుండి సాయంత్రం 4.00 గంటలకు ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే, MDO రామ్ ప్రసన్న, MTMC అడిషనల్ కమిషనర్ హేమ మాలిని, MTMC అధికారులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బందితో, వాలంటీర్లతో, నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వైస్సార్సీపీ 3 సంవత్సరాల కాలంలో అర్హులైన పేద వారికి సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే ఆర్కే ఈ రోజు మొత్తం 220 లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లారు. కొన్ని కొన్ని సమస్యలను ఎమ్మెల్యే ఆర్కే అక్కడే పరిష్కరించి త్రాగునీటి మరియు డ్రైనేజీ, రోడ్లు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News