జనవాణి జనసేన భరోసా కార్యక్రమం కు తగినంత సెక్యూరిటీ కల్పించాలి… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  చేపట్టిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమం కు తగినంత సెక్యూరిటీ కల్పించాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్  కాంతిరాణా టాటా ని కోరిన విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్. ఈ కార్యక్రమం విజయవాడ నగరంలో 3.7. 2022 ఆదివారం ఉదయం 10.00 గంటలు నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం బందర్ రోడ్డు లో జరుగుతుందని , ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధిత పక్షాల నుండి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలియజేసినారు. కావున సమస్యలపై ప్రజలు, ప్రజా సంఘాలు మరియు వివిధ వర్గాల చెందినవారు  పవన్ కళ్యాణ్ ని కలిసి వినతి పత్రం అందజేసి న యెడల వారి సమస్యల పరిష్కారం కోసం పార్టీ కృషి చేస్తుందని తెలియజేసినారు. విజయవాడ కమిషనర్ ని కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మరియు నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *