జిల్లాలోని 29 సచివాలయాల్లో కొత్తగా ఆధార్ నమోదు, నవీకరణ కేంద్రాలను ప్రారంభించాం…

-రాజమండ్రి డివిజన్ లో 27, కొవ్వూరు డివిజన్ లో రెండు
-త్వరలో మరిన్ని సచివాలయల పరిధిలో ఆధార్ సేవలు
-కలెక్టర్ డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ని 29 గ్రామ / వార్డు సచివాలయాలలో ఆధార్ నమోదు సవరణ కోసం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవి లత గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని 9 మండలాలు పరిధిలో ఈ 29 కేంద్రాలలో ఆధార్ కు సంబందించిన నమోదు , నవీకరణ చేసేందుకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ను ఎంపిక చేసి, పూర్తి స్థాయి లో శిక్షణ, అధంటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆధార్ నమోదు కేంద్రం లో కొత్తగా ఆధార్ నమోదు, ఇంటి చిరునామా మార్పు, ఫోన్ నెంబర్లు తప్పుల సవరణ , చిన్న పిల్లల బయోమెట్రిక్ నవీకరణ, వృద్ధులకు చెందిన వేలి ముద్రల (బయోమెట్రిక్) నవీకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రాలలో కూడా ఆధార్‌ నమోదులు, అప్‌డేట్ అభ్యర్థనలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరాలనే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా సచివాలయా ల్లో ఆధార్ సేవలు తీసుకుని రావడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు.

కొవ్వూరు డివిజన్ లో కేంద్రాలు
గోపాలపురం మండలం లో గోపాలపురం సచివాలయం (10590051) సురేష్ కృష్ణ, తాళ్లపూడి లో తాళ్లపూడి-1 సచివాలయం ( 10590074) రమేష్ కుతాడ లను నియమించామన్నారు.

రాజమండ్రీ డివిజన్ పరిధిలో కేంద్రాలు :
అనపర్తి మండలంలో మహేంద్రవాడ-1 సచివాలయం ( 10490226) కర్రి రాజ గోపాల రెడ్డి, రామవరం-2 (10490234) మద్దుల గంగా భవాని, అనపర్తి-4 (10490219) కనకాల దుర్గా కళ్యాణి , గోకవరం మండలం గోకవరం – 1 (10490603) కంగాళ సంధ్యా రాణి, కొత్తపల్లి – 1 (10490611) నాళం సాయి కృపాకర్ , మల్లవరం – 1 (10490614) కతి పోసియ్య దొర, తంటికొండ (10490618) బత్తుల పుష్పరాజు, కోరుకొండ మండలంలో బూరుగుపూడి ( 10490622) తలసాల వెంకట ప్రసాద్ , గాడాల (10490626) మిద్దె చందన స్వామి, నరసాపురం (10490639) మందపల్లి రేష్మా ప్రియాంక, కోటికేశ్వరం (10490636) కాలెపు వీర సత్యనారాయణ, కోరుకొండ -1 (10490633) దనియాకుల వీర మణికంఠ రాజమండ్రి అర్బన్ లో జాంపేట-01 ,(21064011) బి ఎ కుమార్ బెందుకూరి, చందాచౌల్ట్రీ స్ట్రీట్ (21064058) ఉబా పృథ్వీరాజ్ కుమార్, తుమ్మలవా (21064065) వై జ్ఞాపిక , ఇన్నిస్ పేట-02 (21064037) తిరుసుల శ్రీహరి, ఆదెమ్మదిబ్బ ,(21064064) వుడా ఆనంద కుమార్ , రాజమహేంద్రవరం రూరల్ లో కొలమూరు-1 (10490303) త్రిపురారి జ్ఞాన సత్య మనోహర్, కాతేరు-1 (10490298) పెనుగుల చిన బాబు, పిడింగొయ్యి-1 (10490307) కర్రి శేఖర్ బాబు, ధవళేశ్వరం -1 (10490289) సన్యాసినాయుడు ను, రాజానగరం మండలంలో రాజానగరం-2 ,(10490346) ఇమ్మండి రాజా రమేష్, రంగంపేట మండలం దొడ్డిగుంట (10490373) జి పైడిరాజ్‌కుమార్, వడిసలేరు-1 (10490387) జంజ్యం సింధు సీతానగరం మండలంలో బొబ్బర్ ల్లంక (10490645) కర్రి అరుణ్ మణి కుమార్, ముగ్గళ్ల (10490654) మంద పూర్ణశ్రీ, చినకొండేపూడి (10490647) ఉబా సునీల్ కుమార్ లు ఆయా కేంద్రాలలో ఆధార్ నమోదు చేయడం జరుగుతుంది. ఇందుకు అనుగుణంగా ఆయా కేంద్రాలలో గ్రామ వాలంటీర్లు ద్వారా వివరాలు సేకరించి టైమ్ స్లాట్ ఇచ్చి నమోదు, నవీకరణ చేస్తారని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాజమండ్రి రూరల్ కొలమూరు లో గురువారం ఆధార్ నమోదును డివిజనల్ డెవలప్మెంట్ అధికారి రత్న కుమారి పర్యవేక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *