విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పోరేట్ వసతి గృహాలకు ధీటుగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో సదుపాయలు ఉండాలని రాష్ట్ర మహిళాకమీషన్ సభ్యురాలు బూసి వినీత అన్నారు.
నగరంలోని గవర్నపేట కోర్టు సముదాయలకు ఎదురుగా ఉన్న మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ను గురువారం మహిళాకమీషన్ సభ్యురాలు బూసి వినీత ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో పలు ప్రైవేట్ వ్యాపార సంస్థలు, ఆసుప్రతులు, విద్యా సంస్థలు తదితర కార్యాలయాలలో పనిచేస్తూ వసతి గృహంలో ఉంటున్న మహిళలకు కార్పోరేట్ వసతి గృహాలకు ధీటుగా సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు. వసతి గృహంలో వంద మందికి పైగా వర్కింగ్ ఉమెన్స్ ఉంటున్నారని వారికి తమ సొంత ఇంటిలోనే ఉండే వాతావరణాన్ని కల్పించి భోజన వసతి సదుపాయలు కల్పిస్తున్నామని వసతి గృహ సూపరింటెండెంట్ పూర్ణిమ కమీషన్ సభ్యురాలికి వివరించారు. తొలుత వసతి గృహంలో వర్కింగ్ ఉమెన్స్‌కు కల్పిస్తున్న సదుపాయాలను, గదులను, ఆహార మెనూను పరిశీలించి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహణ పట్ల కమీషన్ సభ్యురాలు వినీత సంతృప్తి వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News