కమిటీ సభ్యులు నెలలో రెండు కాలేజీలలో తనిఖీ చెయ్యండి

-పర్యటించిన వాటిపై కమిటీ సమావేశం నిర్వహించాలి
-జేసీ శ్రీధర్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య నేపథ్యంలో జిల్లాస్థాయిలో జిల్లా పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. తనిఖీల్లో ర్యాగింగ్, తదితరు అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ అధ్యక్షులు గా, జిల్లా వృత్తి విద్యా అధికారి జే విఎస్ఎస్ సుబ్రహ్మణ్యం కన్వీనర్ గా, జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, కళాశాలలో చదివే విద్యార్థులపై ఒత్తిడి తెస్తే పర్యవేక్షణ చేసే కమిటీ ఉందన్న విషయంలో యాజమాన్యాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పరీక్షలలో వచ్చే ఫలితాలను ఆధారంగా నూన్యత భావానికి గురై పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది సమాజానికి మంచి సాకేతం కాదన్నారు. అదేవిధంగా ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు ఒత్తిడి అధికంగా ఉంటుందన్నారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లల నుంచి అధికంగా ఆశించడం, వేరొకరితో పోల్చడం కూడా ఒకానొక కారణం అన్నారు. ప్రతి విద్యార్థి ఓటమి నుంచి గెలుపు దిశగా అడుగులు వేయాలన్నారు. జిల్లాలో ప్రవేటు జూనియర్ ఇంటర్ కళాశాలలో జరిగే బోధన తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో కళాశాలలో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇంటర్మీడియట్ విద్యార్థులలో జరుగుతున్న ఆత్మహత్యలపై జాతీయస్థాయిలో చర్చించినట్లు తెలిపారు. విద్యార్థులలో ఆత్మహత్యలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిశీలన ద్వారా అధ్యయనం చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందన్నారు . అందుకు అనుగుణంగా తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు జిల్లా మోనటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి తొలి సమావేశం నిర్వహించామన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా వృత్తి విద్య అధికారి, పోలీసు, విద్య, వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ, ఎనిమిది శాఖల కు చెందిన అధికారులు కమీటిలో సభ్యులుగా ఉంటారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *