-ఘాట్ల నిర్వాహణ కోసం ప్రత్యేక శానిటేషన్ ఎజెన్సీ
-ఎంపి భరత్ రామ్, కమిషనర్ దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది పరిరక్షణ దిశగా ఘట్లను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు చర్య తీసుకోవడం జరుగుతుందని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు.
శనివారం స్థానిక పుష్కర్ ఘాట్ లో చేపట్టిన కార్యక్రమంలో నగర్ కమిషనర్ దినేష్ కుమార్ రూడా చైర్మన్ షర్మిలా రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ, రాజమహెంద్రవరం నగరంలో 16 ఘాట్స్ ఉన్నాయని వాటిలో ప్రధానంగా నాలుగైదు ఘాట్ లలో ఎక్కువగా భక్తులు పూజాధి కార్యక్రమాలు పుణ్య స్నానాలు చేస్తారన్నారు. దక్షిణ గంగగా పేరుపొందిన గోదావరి నది పవిత్రతను కాపాడే దిశలో నగర కమీషనర్ దినేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా గోదావరి ఘాట్ లను శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఒక నెల చేపట్టి ఫలితాలు ఆధారంగా మరింత నాణ్యతతో ఘాట్ల నిర్వహణ చెప్పట్టడం చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో కొందరు తప్పుడు అసాంఘిక టి కార్యక్రమాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని వారిపై నిఘా పెట్టి నియంత్రించడం జరుగుతుందని తెలిపారు.
రూడా చైర్ పర్సన్ ఎం. షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, గోదావరి నది పవిత్రతను కాపాడడం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వవలసి ఉందన్నారు. మనది అనే భావన ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆమె పేర్కొన్నారు. అనవసంగా గోదావరి నదిలో వ్యర్థము లు వేసి కలుషితం చేయవద్దని కోరారు.
నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాజమండ్రి అనగానే గుర్తుకు వచ్చేవి ప్రధానంగా గోదావరి, ఘాట్లు అన్నారు. వాటిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత నగర పౌరులుగా మనందరిపై ఉందన్నారు. ఇప్పటికే మిషన్ గోదావరి పేరిట గోదావరి నది పరిశుభ్రతకు అడుగులు వేయడం జరిగిందన్నారు. ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను నగర పౌరులను భాగస్వామ్యం చేస్తూ న్నట్లు తెలిపారు. ఇప్పటికే స్కిమ్మర్ ద్వారా గోదావరి నదిలోని వ్యర్ధాల ప్రక్షాళన కార్యక్రమాన్ని గత నెలలో ప్రారంభించామన్నారు. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఘాట్లను 24 * 7 పరిశుభ్రంగా ఉంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ఇందుకోసం ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా 30 మంది పైగా సిబ్బందిని నగరంలోని 16 ఘాట్ లో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిర్వహణ దిశగా చర్య తీసుకుంటున్నామన్నారు. మరో ఐదు మంది భద్రత సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. నదిలో వ్యర్ధాలు వేసే వారిపై అపరాధ రుసుం వేయడం జరుగుతుందన్నారు. స్నానాలు చేసే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా , నది లో పరిశుభ్రత కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొదటి పది ) పదిహేను రోజులు ఘాట్లను పరిశుభ్రం చేసి అనంతరం వాటిపై నిరంతర నిర్వహణ చర్యలు తీసుకుంటామన్నారు. నగర ప్రజలు కూడా వారి నుంచి నగరపాలక సంస్థకు అన్ని విధాలా సహకరించాలని కోరారు.
మున్సిపల్ హెల్త్ ఆఫీసరు డా. ఏ.వినూత్న, విశ్వే స్వర రెడ్డి, నాయకులు,ఎన్. శ్రీనివాస్, కె. రజనీకాంత్, యం. అప్పారావు, సీ. హెచ్. సుబ్రహ్మణ్యం, దాసి వెంకట్రావు, మునిసిపల్ సిబ్బం ది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News