రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం

-వరద, ముంపు నివారణ కు ముందస్తు చర్యలతో అప్రమత్తం
-జిల్లా, డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ లు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నదికి ఆకస్మిక వరదలు వచ్చే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని జిల్లా స్థాయి, డివిజన్ పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి 24 గంటలు షిఫ్ట్ లలో సిబ్బందిని నియమించామన్నారు.

కలెక్టరేట్ పరిధిలో కంట్రోల్ రూం
8977935609 నంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా షిఫ్ట్ ల వారీగా సిబ్బంది నియమించినట్లు తెలిపారు.
జూలై 8 వ తేదీన నుంచి జూలై 11 వ తేదీ వరకు షిఫ్ట్ లలో కలెక్టరేట్ సిబ్బంది అందుబాటులో ఉంచి, ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని అధికారులతో సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో డివిజన్ పరిధిలో
జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం 0883 2442344, కొవ్వూరు 088132 31488 ల్యాండ్ లైన్ నంబర్ల ను అందుబాటులో ఉంచామని , 24 x 7 సిబ్బంది షిఫ్ట్ లలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *