సీజనల్ వ్యాధులు ప్రభలకుండా గ్రామాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి..

-స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ నీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత కాలువలోనే పరిష్కరించాలి
-ఈ రోజు స్పందనలో 137 ఫిర్యాదులు అందాయి
-జిల్లా కలెక్టర్  డా.కె.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత అధికారులు ఆదేశించారు. సోమవారం స్థానిక  కలెక్టరేట్లోని స్పందన హాలు నందు ప్రజల నుంచి జిల్లా కలెక్టర్   మాధవీలత, జేసీ సి.హెచ్. శ్రీధర్, సంబంధిత అధికారులతో కలిసి  ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ గత వారం రోజులుగా జిల్లాలో వర్షాలు పడుతున్నందున గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచే విధంగా ఆయా గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వారి సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి పర్యటిస్తూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు విస్తరించే అవకాశం ఉన్నందున ముందస్తు మెడిసిన్ అందుబాటులో ఉంచి ప్రజలకు అందజేయాలన్నారు. వర్షాలు విస్తారంగా పడుతున్నందున గ్రామాల్లో నీరు నిలువ ఉండకుండా డ్రైనేజీలు సక్రమంగా పారుదలయ్యేలా
గ్రామపంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఎక్కడ చెత్తాచెదారం లేకుండా పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయించాలని సూచించారు. జిల్లా ప్రజలందరు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

స్పందనలో ప్రజల  నుంచి 137 ఫిర్యాదులు అందాయన్నారు. స్పందనలో వచ్చిన ఏ ఒక్క వచ్చి రీఓపెన్ కాకుండా అర్జీ దారులకు శాశ్విత పరిష్కారాన్ని నిర్ణీత కాలంలోగా చేయాలని శాఖల వారి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం నిమిత్తం స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు.  ఇందుకు అనుగుణంగా జిల్లా, డివిజన్, మండల స్థాయి పరిధిలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించి అర్జీదారునికి న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

జిల్లాలో జిల్లాలో మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి అధికారులు రహదారులను బ్రిడ్జిలను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎలక్ట్రికల్ పోల్స్ తదితర అంశాలపై పర్యవేక్షణ చేస్తుందని ఆదేశించారు.

స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు
రాజమహేంద్రవరం కు చెందిన సిహెచ్ సుధారాణి తమ అర్జీలో తన కుమారుడు వయసు 16 సంవత్సరాలని గత కొంత కాలంగా బోన్ టీబీతో బాధపడుతున్నాడని, కావున గురుకుల పాఠశాలలో తన కుమారుడికి సీటు ఇప్పించాలని కోరారు.

సీతానగరం మండలం జాలిపూడి గ్రామానికి చెందిన సిద్దే వెంకాయమ్మ తన తమ్ముడు ఉర్ల జార్జి ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమణ చేశారని తగు న్యాయం చేయాలని కోరారు.

ఈ స్పందన కార్యక్రమం లో జేసీ సిహెచ్. శ్రీధర్, జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ డా.స్వర్ణలత, సీపీఓ ప్రసాద్ , ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ రమేష్, డ్వామా పిడి పి జగదంబ, డిపివో సత్యనారాయణ, డిఎస్ఓ పి.ప్రసాదరావు, డీఎస్ ఈడబ్ల్యూ & ఈఓ ఎమ్ ఎస్ శోభారాణి, జిల్లా హౌసింగ్ అధికారి తారా చంద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవ రావు, పశుసంవర్ధక శాఖ అధికారి సత్యగోవిందం ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *