Breaking News

జాయింట్ స్టాప్ కౌన్సిల్ ను ప్రక్షాళన చేయాలి…

-జి. ఎ.డి. ముఖ్యకార్యదర్శి కి వినుకొండ రాజారావు విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ వ్యవస్థ ను నాయకులు చులకన చేసి,ఒకపక్క హక్కులు హరించిపోతున్నా, స్వప్రయోజనాలే పరమావధిగా,ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పడాలనే ఆతృతలో ఉద్యోగుల హక్కులు కాలరాసి పోతున్న మౌనంగా ఉంటూ అప్పుడప్పుడు నాయకులు, బెదిరింపు ధోరణిని తో ప్రభుత్వం పై కేసులు నమోదు చేస్తాం అంటూ తొడలు కొడుతూ, మరొక పక్కన గగ్గోలు పెడుతుంటుంటారని, ఇది కేవలం స్వప్రయోజనాల కోసమేనని నిజానికి ఈ నాయకులు ఎప్పుడో ఉద్యోగుల హక్కులను పాతరేశారని, ఉదాహరణకు 11 వ పి.ఆర్.సి లో అశుతోష్ మిశ్రా కమిటి నివేదిక లేకుండా నాయకులు 8 సార్లు ప్రభుత్వం తో చర్చ లకు వెళ్లినప్పుడే,ఉద్యోగుల హక్కులు హరించి పోయాయని , ఉద్యోగ వ్యవస్థ ను నాయకులు చులకన చేయడం వల్లనే ఆరోజు 27% ఉన్న ఐ.ఆర్ ను 23 % కు తలలూ పినారని,అందువల్ల ఉద్యోగుల ఆగ్రహనికి గురికావలసిన పరిస్థితి వచ్చేసిందని అందుకు పోలీసుల రక్షణ లో ఉన్నారని,ఉద్యోగుల కు క్షమాపణ లు చెప్పాల్సిన నాయకులు ప్రభుత్వాన్ని క్షమాపణ లు కోరారని,కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి గాని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గుంచి గాని మాట్లాడేనాయకుడే కరువై నారని, ఇప్పుడు ఉద్యోగుల కు రావలసిన డి.ఎ.లు అడిగేనాధుడే లేడని గత పెండింగ్ డి.ఎ అరియర్స్ నగదు జి.పి.యఫ్, పై గగ్గోలు పెడుతున్నారని, కేవలం లైవ్ లో ఉండటానికి నాయకుల హడావుడి తప్ప మరేది కాదని ఉద్యోగుల సంక్షేమం నాయకులు ఎప్పుడో మరిచారని, ఇప్పటికైనా నాయకులు ఉద్యోగుల కు క్షమాపణ లు కోరి, నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని ఉద్యోగుల కు జరిగే అన్నిరకాల కష్టనష్టాలకు ఈ నాయకులే బాధ్యత వహించాలని,అలాగే రాబోయే 12 వ పిఆర్ సి కి ప్రభుత్వ నియమనిబంధనలు పాటించని జాయింట్ స్టాప్ కౌన్సిల్ సభ్య సంఘాల ను ప్రక్షాళన చేయాలని సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు నేడు ఒంగోలులో ని జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి టి.విజయ్ కుమార్, జి.ఆశాజ్యోతి,ఐ. ఆంజనేయులు, మాకినేని మురళి,యం.వి.నరసయ్య, యం.వెంకటేశ్వర నాయక్,యన్.చైతన్య, బి శిరీష, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అసోషియేట్ ప్రసిడెంట్ గా పయ్యావుల శ్రీ నివాసరావు ఎన్నిక
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న పయ్యావుల శ్రీనివాసరావు గారిని జిల్లా అసోషియేట్ ప్రసిడెంట్ గా ఎన్నికచేసినట్లు వినుకొండ రాజారావు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *