-అధికారులకు ఆదేశాలు : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, సోమవారం 8వ డివిజన్ పరిధిలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, ఎస్.బి.ఐ కాలనీ, మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ, కె.జె.గుప్త కళ్యాణమండపం రోడ్ మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా డివిజన్ పరిధిలో విధులు నిర్వహించు పారిశుధ్య కార్మికుల FRS మస్తరు విధానము పరిశీలించి, డివిజన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు సంబందించి డోర్ టు డోర్ చెత్త సేకరణ తీరును అడిగితెలుసుకొన్నారు. ప్రధాన వీధులలో రోడ్ స్విప్పింగ్ పూర్తి అయిన వెంటనే అంతర్గత రోడ్లు శుభ్ర పరచి 100 శాతం నివాసాల నుండి చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య సిబ్బంది ఆదేశించారు. అదే విధంగా సైడ్ డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకు అవరోధకరంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి డ్రెయిన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని అన్నారు. డివిజన్ పరిధిలో మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి వాటర్ పైప్ లైన్ లీకేజిలు లేకుండా చూడాలని మరియు యు.జీ.డి నందలి మురుగునీటి పారుదలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News