స్ఫూర్తి ప్రదాత ఆంధ్రకేసరి ఆదర్శాలను భావితరాలకు తెలియజేయడం మన కర్తవ్యం…

-కలెక్టర్ డా.కె.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మద్రాసు నగరంలో బ్రిటిష్ సైన్యానికి ఎదురు తిరిగి నిలబడి  సైమన్ కమిషన్ గో బ్యాక్ నినాదంతో దేశం మొత్తం చైతన్యం తీసుకుని వొచ్చిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికితొలి ముఖ్యమంత్రిగా పనిచేసారని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీ లత అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కోటగుమ్మం సెంటర్ సమీపంలో ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అ ర్పించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 151 వ జయంతి వేడుకలు సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, రూడా చైర్ పర్సన్ శర్మిలా రెడ్డి లతో కలసి ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ బ్రిటిష్ సైన్యానికి ఎదురు తిరిగి సైమన్ కమిషన్ గో బ్యాక్ నినాదంతో దేశం మొత్తం చైతన్యం తీసుకుని వొచ్చిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. ఫ్రీడమ్ ఫైటర్ గా ఎదిరించి నిలబడినందుకు ఆం ధ్రప్రదేశ్ ఆంధ్రకేసరి అనే బిరుదును ఇవ్వడం జరిగిందన్నారు. గొప్ప దేశభక్తుడని, ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శ ప్రాయంగా తీసుకోవాలన్నారు. రాజమండ్రితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఇక్కడే న్యాయ శాస్త్రాన్ని అభ్యసించి, బార్ అసోసియేషన్ లో కీలక పాత్ర పోషించి, రాజమం డ్రి మునిసిపల్ ఛైర్మెన్ గా పనిచేసి గొప్ప ఖ్యాతిని గడిచారన్నారు. కార్యసాధనలో ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోగలిగే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అన్నారు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని
నిరూపించిన మహనీయుడన్నారు.

మునిసిపల్ కమిషనర్ కె. దినే ష్ కుమార్ మాట్లాడుతూ రాజమండ్రి పురపాలక సంఘానికి మునిసిపల్ చైర్మన్ గా 19వ శ తాబ్దం తొలి దశకం లో టంగుటూరి ప్రకాశం పంతులు తన 35 వ ఏటనే పనిచేశారని తెలిపారు. మన నగరంతో అటు వంటి మూలాలు ఉన్న ప్రాంతంలో ఆంధ్రకేసరి 151 వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఒక మంచి అవకాశాన్ని కల్పిం చిందని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా రుడా ఛైర్ప ర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మాట్లాడుతూ మన రాజమండ్రి మునిసిపల్ ఛైర్మెన్ గా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమం త్రిగా పని చేసిన గొప్ప చరిత్ర ఆయనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి మెయిన్ రోడ్ కోటగుమ్మం రైల్వే సబ్ వే మా ర్కెట్ వర్తకుల సంఘ షాపులను కలెక్టర్ మాధవీలత పరిశిలించారు. ఈ కార్యక్రమం లో అదనపు కమీషనర్, పి. యం.సత్యవేణి, మునిసిపల్ ఈ. ఈ. శేషగిరి రావు, సెక్రటరీ బి. వి. రమణ రావు, ఆర్. ఓ, సి. హెచ్. శ్రీని వాసరావు, ఆర్. ఓ,రవికుమార్, డి. ఈ, ప్రకాశరావు మేనేజర్ (ఇంచార్జి) మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *