రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, సంక్షేమ పథకాలు మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో డి ఐ పీ ఆర్వో గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్. శ్రీనివాసు బాధ్యత లు చేపట్టిన అనంతరం మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను, జాయింట్ కలెక్టర్ లను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత , జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో డిపిఆర్వో ఐ. కాశయ్య, డివిజనల్ పి ఆర్వో ఏం. లక్ష్మణా చార్యులు ఉన్నారు. అనంతరం ఇంఛార్జి డిఆర్వో ఎస్.మల్లిబాబు ను కలిశారు. అంతకు ముందు ఉదయం వై టి సి లోని డిఐపిఆర్వో కార్యాలయంలో ఐ. కాశయ్య నుంచి ఛార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా డి పి ఆర్వో ఐ. కాశయ్య , డిఎల్ పిఆర్వో లక్ష్మణా చార్యులు, సిబ్బంది శాంత కుమారి, పుల్ల మాంబ, రామకృష్ణ, ఈ .సురేష్, శేఖర్, ప్రేమ్, భానుప్రకష్, రమణ, వెంకటేశ్వర రావు, జయరాజు, భవాని తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News