రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
2022.23 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ కి సంబంధించి జిల్లా స్థాయిలో కార్యాచరణ అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, విసి అండ్ ఎండి జీ వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, ప్రస్తుత 2022-23 ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ధాన్యం సేకరణ కి సంబంధించి పౌర సరఫరాల శాఖ జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా మేనేజర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, జిల్లా సహకార సంస్థ, మార్కెటింగ్, తూనికలు కొలతలు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ లతో పౌర సరఫరా ల శాఖ సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా లో ధాన్యం దిగుబడి, పండించే రకాలు ఆధారంగా మండల వారీగా వివరాలు సేకరించెందుకు క్షేత్ర స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏ ఏ అర్భికే పరిధిలో ఏ రకం సాగు చేస్తున్నారు, ఎంత దిగుబడి వంటి వాటి పై నివేదికలు తయారు చేస్తున్నామని, ఆయా అర్భికే లకు వాటికి అనుసంధానం చెయ్యనున్నట్లు తెలిపారు. మార్కెటింగ్ శాఖ ద్వారా కావలసిన పరికరాలు, గోనె సంచులు తదితర వాటి వివరాలు క్రోడికరించుకుని సేకరణ కోసం పూర్తి స్థాయి లో సమాయత్తం చెయ్యడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. తూనికలు కొలతలు శాఖ ద్వారా ఆయా బరువు తూచే పరికరాలు తనిఖీలు చేపట్టడంపై ఆదేశాలు జారీ చేశామన్నారు. క్షేత్ర స్థాయి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఏ అర్భీకే కు, ఏ మిల్లు ట్యాగ్ చేసేలా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ద్వారా రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలియచేశారు. ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి పి . ప్రసాద్ రావు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ తనూజ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News