జిల్లాలో 40 గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న స్వమిత్వ సర్వే

-సర్వే ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారితనంతో చేపట్టాలి
-జిల్లాలో అమలు చేసిన ఉత్తమ విధానాలతో నివేదిక రూపొందించాలి
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని పంచాయతీ ల పరిధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లకు నిర్ణీత సమయం లోగా ఆస్తి పన్ను విధించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు గ్రామ పంచాయతీ లో స్వమిత్వ సర్వే వివరాలను, సంబంధిత మ్యాప్, రికార్డులను పరిశీలించారు .

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, స్వమిత్వ పథకం ద్వారా గ్రామాలలో మెరుగైన సాంకేతికతతో కూడిన సర్వే, మ్యాపింగ్ చెయ్యవలసి ఉంటుందన్నారు. ఈవిధానంలో పారదర్శకత జవాబుదారీతనం తో సర్వే చేపట్టవలసి ఉందన్నారు. సామాజిక-ఆర్థిక సాధికారతను, స్వీయ సాధికారతను ప్రోత్సహించడానికి ఆస్తి సర్వే కార్యక్రమంగా ప్రభుత్వాలు అమలు చేయడం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత ఎన్ని రోజుల్లో అసెస్మెంట్ వేసి ఇంటి పన్ను విధించడం జరుగుతుందని అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం కు మార్గదర్శకాలు మేరకు పన్నులను వెయ్యడం ద్వారా ఆదాయం సాధించడం చాలా కీలకం అన్నారు. స్వమిత్వ కింద జిల్లాలోని అన్ని పంచాయతీ పరిధిలో పన్నులు విధించవలసిన ఆస్తులకు సంబంధించిన సర్వే నిర్వహించి నివేదిక అందజేయ్యాలన్నారు. పంచాయతీ కార్యదర్శులకు, సంబందించిన సిబ్బందికి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సరైన దిశా నిర్దేశనం చెయ్యాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాజవోలు గ్రామం పరిధిలో 4200 గ్రామ కంఠాల భూములకు చెందిన సర్వే నిర్వహించడం జరిగిందని అధికారులు వివరించారు. జిల్లాలో 40 గ్రామ పంచాయతీల్లో స్వమిత్వ సర్వే చేస్తున్నట్లు డిపివో పి. జగదాంబ పేర్కొన్నారు. ఈ సర్వే ప్రక్రియ ద్వారా వచ్చిన ఫలితాలు, క్షేత్ర స్థాయి లో ఉత్పన్నం అయిన సమస్యలు, ఉత్తమ పనితీరు చూపే అవకాశం ఉన్న అంశాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి పి. జగదాంబ, జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు, డివిజనల్ పంచాయతీ అధికారి జేవి సత్యనారాయణ, పంచాయతీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *