Breaking News

ప్రత్యేక ప్రతిభావంతులకు అండగా ప్రభుత్వం – కలెక్టర్ వెంకటరమణారెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారు సమాజంలో మెరుగైన జీవనం కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్య ఆధ్వర్యంలో తిరుపతి డివిజన్ లో టి.పి.పి.ఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాల వైద్య పరిచర్య శిబిరాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం దివ్యాంగులందరూ తప్పని సరిగా విద్యను అభ్యసించేందుకు వీలుగా పాఠశాలల్లో ర్యాంప్ సౌకర్యం, మరుగు దొడ్లు సమకూర్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 34 భవిత కేంద్రాలను ఏర్పాటుచేసి విద్యనందిస్తున్నామని తెలిపారు.

మంగళ వారం వైద్య శిబిరానికి 120 మంది ప్రత్యేక ప్రతిభావంతులు హాజరయ్యారని వీరిలో 40మంది వినికిడి యంత్రాల కోసం, 40 మంది ఇంటలెక్చువల్ దిజేబిలిటీస్ వారికి టి.ఎల్.ఎం కిట్లు, 30 మంది అంగ వైకల్యం గల వారికి వీల్ చైర్స్, Rolaters, CP చైర్స్ కొరకు మరియు 10 మంది కంటి చూపు సమస్య గల వారికి ట్రై సైకిల్స్, కాలిపర్స్ మొదలగు ఉపకరణాల కోసం ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

అనంతరం పిల్లలతో కలెక్టర్ మాట్లాడి వారికి మనో ధైర్యాన్ని కల్పించారు. స్కూల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఎఫ్ఏ 2 తెలుగు మరియు గణిత సబ్జెక్టులలో తరగతిలో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందచేసారు. జిల్లా విద్యా శాఖాధికారి మరియు సమగ్ర శిక్ష ఎపిసి శేఖర్ మాట్లాడుతూ 7వ తేదీ శ్రీకాళ హస్తి, 8వ తేదీ గుడూరు, 9వ తేదీ నాయుడు పేట డివిజన్ లలో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని బడి ఈడు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహిత విద్య సమన్యయకర్త రామచంద్రారెడ్డి, సి.ఎం.ఓ సురేష్, ఏ.పి.ఓ గోపాలక్రిష్ణ, హెచ్.ఎం ఆనంద కుమార్, డాక్టర్లు రాజశేఖర్, విశాల్ కుమార్, రమాప్రియ, దీప్తిచరిష్మా, ఉదయకిరణ్, శ్రీనివాసులు, ఐ.ఈ. రిసోర్సు టీచర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *