‘‘స్పా’’ ముసుగులో ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

-టీమ్‌లుగా ఏర్పడి నిఘా ఉంచండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని స్పా సంసృతితో నిర్వహించే మసాజ్‌ సెంటర్లు, బ్యూటీపార్లర్‌లపై ప్రత్యేక నిఘా పెట్టి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం పోలీస్‌, నగరపాలక సంస్థ, ఐసిడిఎస్‌ కార్మిక శాఖల అధికారులతో ది ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌ (ప్రివెన్షన్‌) (ఐటి (పి)1956 చట్ట అమలు పర్యవేక్షణపౖౖె జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలో ‘‘స్పా’’ సంసృతి నిర్వహించే కొన్ని మసాజ్‌ సెంటర్లు బ్యూటీపార్లర్‌లలో యువతలను ఆకర్షింపచేసి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కేసులు నమోదు అయిన్నప్పటికి వాటిపై ప్రటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై కలెక్టర్‌ ఆసహనం వ్యక్తం చేశారు. గత సమీక్ష నాటికి 11 కేసులు నమోదయ్యాయని, 15 రోజులలోపు మరోక 7 కేసులు నమోదు కావడం దృరదృష్టకరమన్నారు. ఇటువంటి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత అధికారులు టీమ్‌లుగా ఏర్పడి నిరంతర పర్యవేక్షణతో నిఘా ఉంచాలన్నారు. అనుమతించిన చట్టబద్దమైన కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అదే సమయంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారి సంస్థల లైసెన్స్‌ను రద్దుచేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉపయోగపడే టిండర్‌ యాప్‌, బంబుల్‌ యాప్‌లను పోలీస్‌ శాఖ పరిశీలించి యువతి యువకులు పెడదారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా హోటల్స్‌, అపార్ట్‌మెంట్స్‌, ఇతర గృహలపై కూడా నిఘా ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు.
సమావేశంలో డిసిపి యం సత్తిబాబు, ఐసిడిఎస్‌ పీడి జి. ఉమాదేవి, ఎసిపి సిటిఎఫ్‌ జి.వి. రమణమూర్తి, వియంసి ఛీప్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. పి రత్నావలి, కార్మిక శాఖ డిప్యూటి కమీషనర్‌ యం శ్రీమన్నారాయణ, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *