విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్కేటింగ్ పోటీలలో విజయవాడ క్రీడాకారిని చైత్ర దీపిక శనివారం బెంగళూరులో జరిగిన ఫెయిర్ స్కేటింగ్ పోటీలలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిగోల్డ్ మెడల్ క్యైవసం చేసుకున్న ది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మంగళవారం తన కార్యలయం లో చైత్ర దీపికను అభినందించారు. సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ చైత్ర ను ఆదర్శంగా తీసుకుని యువత విద్యతోపాటు క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని దేశానికి రాష్ట్రానికి వన్నె తేవాలని అన్నారు.
Prajavartha Online Telugu News