వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు… అంటూ ఈనెల 17 నుండి వైజాగ్‌ నుండి తిరుపతి వరకు స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు నరహరిశెట్టి శేషుబాబు, గంటల రామారావులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్రమోదీ స్టీల్‌ ప్రైవేటీకరణ పై ప్రకటన విడుదల నుండి ఇప్పటికే కొన్ని కార్మిక సంఘాలు అక్కడ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితిగా ఏర్పడి చేస్తున్న దీక్షకు ప్రభుత్వ స్పందన కరువైనందుకు ఈ పాదయాత్ర ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనికి పరిష్కారం తిరుపతి వెంకటేశ్వరస్వామి ఒక్కటే చూపగలుగుతారని నమ్మకంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని దీని ద్వారా అయినా ప్రధాన మోదీ మనసు మారి ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగేలా చేస్తారని ఆశతో కొనసాగిస్తున్నామన్నారు. మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా తనవంతు ఎంపిలతో ప్రయత్నం చేస్తున్నారని మరింత గట్టిగా జరిగేలా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు స్టీల్‌ ప్లాంట్‌ ఒక మకుటం లాంటిదన్నారు. మేము ముగ్గురం బయలుదేరామని కొన్ని ఆరోగ్య ఇబ్బందుల వలన ఒకరు విరమించుకున్నారని మేము కొనసాగిస్తున్నామని రోజుకు 30`35 కిలోమీటర్లు నడుస్తున్నామన్నారు. సుమారు 740 కిలోమీటర్లు వుంటుందని నేషనల్‌ హైవేలో కలిసిన యూత్‌ కాంగ్రెస్‌ లీడర్‌ అల్లం రాజేష్‌కు తెలియజేయగా ఆయన స్పందించి తన మద్దతు తెలుపుతూ కొంత దూరం కొనసాగి తనవంతు సహాయం అందజేయడానికి ప్రయత్నం చేస్తానన్నారు. ఇటువంటి యువ నాయకులు ప్రతి చోటా తయారు అవ్వాలని అల్లం రాజేష్‌ను వారు అభినందించారు. ఏది ఏమైనా కూడా వారి కోరిక తీరాలని వెంకటేశ్వరస్వామి కరుణించాలని కోరుకుందాం…

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *