గడపగడపకు అపూర్వ స్పందన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అందుకు నిదర్శనమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న అపూర్వ స్పందన అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్,80వ సచివాలయం పరిధిలోని రాణిగారితోట మసీదు ప్రాంతాల్లో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్ళ కాలంలోనే కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతంలో రోడ్లు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణాలు, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ నిర్మించి వరద ముంపు నుండి ప్రజలను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని అన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చి పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తుంటే ఓర్వలేని టీడీపీ నాయకులు కోర్ట్ లకు వెళ్లి స్టే లు తేవడం దుర్మార్గం అని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే వారి రాజకీయ మనుగడ కోసం అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రతి నెల అర్హత ఉన్న వారికి పెన్షన్లు ఇస్తూ ఉంటే వాటిని తొలగిస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అని, మీ టీడీపీ హయాంలో ఇచ్చిన పెన్షన్లు ఎన్ని, నేడు మా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఎన్నో చర్చ కు సిద్ధమా అని అవినాష్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మీరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజల గుండెల్లో జగన్ గారి మీద అభిమానం చెక్కు చెదరదు అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, వైసిపి నాయకులు దామోదర్, బుచ్చిబాబు, తాజుద్దీన్, తిరుపతి రెడ్డి, సుజాత, బులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *