-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వాకల్చర్ జోన్ ప్రకటన ద్వారా స్థిరమైన ఆక్వా సంస్కృతిని ప్రోత్సహించండమై దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆక్వా జోన్ జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, ప్రత్యేక అహ్వానితులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత, జిల్లాలో మరింతగా ఆక్వా కల్చర్ ను సాగు లోనికి తీసుకొని వొచ్చే సామర్థ్యం పెంచే క్రమంలో ప్రభుత్వ నియమ నిబంధనలు అనుగుణంగా చేపట్ట వలసిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో ఆక్వా సాగు చేసే నాన్ ఆక్వా జోన్ లో ఉన్న 971.44 ఎకరాలను ఆక్వా జోన్ లోకి తీసుకుని వచ్చేందుకు కమిటీ ఆమోదం తెలపడం జరిగిందని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం, 2020 లోని మార్గదర్శకాలు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. జిల్లాలో మరింతగా ఆక్వా కల్చర్ పెంపొందించే క్రమంలో శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆక్వా రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని, జిల్లా ఆక్వా సాగు కు అనువైన ప్రాంతాలను గుర్తించి ఆ దిశలో అడుగులు వేయాలని కలెక్టర్ తెలిపారు. మీ నుంచి విలువైన సూచనలు, సలహాలు ఎంతో అవసరం అని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా మత్స్య శాఖ అధికారి వి.. కృష్ణారావు వివరాలు తెలుపుతూ జిల్లాలో 493 మంది రైతులు 2120 ఎకరాల్లో ఆక్వా సాగు కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. వారిలో 112 మందికి చెందిన 346 ఎకరాలు ఆక్వా జోన్ లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఆక్వా కల్చర్ ను ప్రోత్సాహించి జీవనోపాధి అవకాశాలు, ఆహార భద్రత ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపన లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆక్వా సాగు చేసే రైతులకు విద్యుత్ పై ప్రతి ఏటా రూ.22 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మత్స్య అధికారి వి. కృష్ణా రావు, జిల్లా సూక్ష్మ ఇరిగేషన్ అధికారి వై. శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్ ఈ .. జీ.. శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, శాస్త్ర వేత్తలు డా ఎమ్. మురళీధర్, డా ఎమ్.నీరజ, ఆక్వా రైతు ఎస్. శ్రీహరి, సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News