రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 7 నుండి 10 వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులను జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి బయో మెట్రిక్ నవీకరణ చేసుకొని వారికి మార్చి 31 వరకు ఉచితంగా బయో మెట్రిక్ నవీకరణ చెయ్యడం జరుగుతుందని అన్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకునే వారికి ఉచితంగా ఆధార్ కార్డు జారీ కి సంబందించిన ఎటువంటి రుసుము వసూలు చేయడం జరగదని తెలిపారు.
సచివాలయం లో అందించు ఆధార్ సేవలు…
ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్, ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్, పేరు మార్పు ( Proof తప్పనిసరి ), జన్మ దినం మార్పు ( Proof తప్పనిసరి ), జెండర్ మార్పు, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి), చిరునామా మార్పు ( Proof తప్పనిసరి ) కోసం రూ.50 /- చెల్లించాలి, మూడు అంత కంటే ఎక్కువ సేవల కోసం రూ.100/- కొత్తగా ఆధార్ నమోదు ఉచితం, బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్ కోసం రూ.100/- ఆధార్ డౌన్లోడ్ కోసం రూ.100/- లు చెల్లించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News