ముందస్తుగా క్యాన్సర్ వ్యాధిని గుర్తించే పరీక్షలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముందస్తుగా క్యాన్సర్ వ్యాధిని గుర్తించే పరీక్షలు నేడు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఆసుపత్రి లో ఐ ఎం ఐ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఒకరోజు నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడం వల్ల తొలి దశలో క్యాన్సర్ కారకాలను గుర్తించ లేక పోతున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించే అవకాశం నేడు అందుబాటులో ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, వివిధ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచితంగా స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోని క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన సమయం లో చికిత్స పొందడం సాధ్యం అవుతుందని అన్నారు. ఎక్కువ మంది మగ వారు ఎదుర్కొనే సమస్యలు ప్రోస్టేట్ క్యాన్సర్ కాగా, మహిళల్లో ఛాతీ, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా గ్రామీణ  ప్రాంతాల్లో కేన్సర్ నిర్దారణ మెడికల్ క్యాంప్స్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు టీచింగ్ ఆసుపత్రుల్లో కూడా కేన్సర్ కు చికిత్స అందించడం జరుగుతుందన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధిని క్రమశిక్షణ కలిగిన జీవన విధానం ద్వారా ఎదుర్కొనడం సాధ్యం అన్నారు. క్యాన్సర్
ను ముందస్తుగా గుర్తించే అవకాశం ఉన్న సందర్భాల్లో ఎటువంటి సంకోచం లేకుండా తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు మనో నిబ్బరం కలిగి ఉండి, మందులు వాడడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడే అకాశముందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఐ ఎం ఎ అధ్యక్షులు డా ఎస్. గురు ప్రసాద్, డా. పద్మ లత, జీ ఎస్ ఎల్ ఆసుపత్రి క్యాన్సర్ స్పెషలిస్ట్ డా. విశ్వనాథ్, డెల్టా ఆసుపత్రి
అంకాలజిస్ట్ డా స్పూర్తి, జిల్లా ఆసుపత్రి డి ఎం ఓ డా. ఆనంద్, డాక్టర్ లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *