జిల్లాలో ఓటరు నమోదు, చిరునామా మార్పు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఓటరు నమోదు, చిరునామా మార్పు తదితరాలకు చెంది గత  ఏడాది ఆగస్టు నుంచి ఫిబ్రవరి 8 వ తేదీ వరకు వొచ్చిన 60,786 దరఖాస్తులలో  52,564 ని స్క్రూటి ని అనంతరం ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాధవీలత పేర్కొన్నారు.

గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం కె మీనా  జిల్లా ఎలెక్టోరల్ & కలెక్టర్ లతో ఓటరు నమోదు,  దరఖాస్తులు పరిష్కారం, ఎన్నికల జాబితాలలో జనాభా సంబంధిత సారూప్య నమోదులు (DSEలు) మరియు ఫోటో సారూప్య నమోదులు (PSEలు), డూప్లికేట్ ఎపిక్ కార్డుల తొలగింపు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కలిగించే ప్రక్రియ లో కాలేజ్ విద్యార్థుల తో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తు లలో  బి ఎల్ ఓ పరిశీలన చేసినవి 1,853 , బీల్వో లి పరిశీలన చేయవలసినవి కు 1090 ఉన్నాయని, ఇప్పటి వరకు 4,633 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందని అన్నారు.

ఫారం 6 కి చెందిన 33,789 దరఖాస్తులకు గాను 29,387 ఆమోదించి నట్లు పేర్కొన్నారు. 2,389 తిరస్కరించామని 2016 పరిశీలన దశలో ఉన్నట్లు మాధవీలత వివరించారు. ఫారం 7 కోసం 18511 కి గాను 17440 ఆమోదించిట్లు పేర్కొన్నారు.

ఫారం 8 కి చెందిన 8,496 దరఖాస్తులకు గాను 6737 ఆమోదించి నట్లు పేర్కొన్నారు. 1258 తిరస్కరించామని , 537 పరిశీలన దశలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఫిబ్రవరి 8 వ తేదీ నాటికి 15,53, 489 ఓటర్లు ఉండగా వాటి వివరాలు ఆధార్ అనుసంధానం 73 శాతం పూర్తి చేశామని అన్నారు.

ఎన్నికల జాబితాలలో జనాభా సంబంధిత సారూప్య నమోదులు (DSEలు) మరియు ఫోటో సారూప్య నమోదులు (PSEలు) 149 గుర్తించడం జరిగిందన్నారు. వాటిని ఈ ఆర్ ఓ, బి ఎల్ వో అధర్వయంలో తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.  డూప్లికేట్ ఎపిక్ కార్డుల తొలగింపు కోసం 60,447 ఓట్లను పరిశీలించగా వాటిలో 13,847 ఓట్లు డుప్లికేట్ తొలగించడం జరిగిందనీ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ జి నర్సింహులు, ఆర్డీవో ఏ చైత్ర వర్షిని తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *