పేదల జీవ‌న ప్రమాణాలు పెంచ‌డ‌మే ల‌క్ష్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద‌ల జీవితాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శనివారం 58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తమ్మిన దుర్గారావు వీధిలో విస్తృతంగా పర్యటించి.. 141 గడపలను సందర్శించారు. మౌలిక సదుపాయాలపై ప్రజలను ఆరా తీశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో ఈ ప్రాంతం ఎంతగానో మార్పు చెందిందని స్థానికులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుని దుశ్శాలువలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నిరంతరం ప్రక్రియగా కొనసాగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. దాదాపు రూ. 15 కోట్ల నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి వెచ్చించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేయడం వల్ల.. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించడానికి అవకాశం లభించిందన్నారు. అనంతరం ప్రజలతో మమేకమై గ్రీవెన్స్ స్వీకరించారు. అవసరమైన చోట వీధి దీపాలతో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు సూచించారు. అనంతరం మీడియతో మాట్లాడారు.

చంద్రబాబు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు..
సీఎం వైఎస్ జగన్ కుటుంబంపైనా, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపైనా చంద్రబాబు, ఆయన మద్దతుదారుల్లో రోజురోజుకీ ఈర్ష్య, ద్వేషం పెరిగిపోతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. 2024 ఎన్నికలలో వైఎస్సార్ సీపీని నేరుగా ఢీకొనే సత్తా లేక పచ్చ మీడియా ద్వారా రోజుకొక తప్పుడు సంకేతాన్ని ప్రజలలోకి పంపుతున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం రాష్ట్రాన్ని తానే నిరంకుశంగా పాలించాలని చంద్రబాబు భావించారని.. కానీ 2019 సార్వత్రిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ప్రజలు రాజకీయ మరణ శాసనం రాశారని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క అవకాశం కోసం చివరకు ప్రజలను ప్రాథేయపడే స్థాయికి చంద్రబాబు, నారా లోకేష్ దిగజారుతున్నారన్నారు.

నారాసుర రక్తచరిత్రను ప్రజలు ఎన్నటికి మరువరు
రాష్ట్రంలో చంద్రబాబుని మించిన క్రిమినల్ లేరని మల్లాది విష్ణు విమర్శించారు. రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్ల మార్గాన్నే ఎంచుకున్న చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్ కుటుంబంపైన విమర్శలు చేయించడం సిగ్గుచేటన్నారు. దొంగ కేసులు పెట్టడం, దొంగ దెబ్బ తీయడం ప్రతిపక్ష నేతకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటుతో మొదలైన నారాసుర రక్త చరిత్ర 2019 వరకు సాగిందన్నారు. ముఖ్యంగా గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మీరు సాగించిన హత్యాకాండలో వందలాది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిందా వాస్తవం కాదా..? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు జీవిత పుస్తకంలో పేజీకో కుట్ర, కుతంత్రం, కుటిల నీతి, హత్యలు కన్పిస్తాయని ఆరోపించారు. పైగా రౌడీలు, గూండాలు, నేరస్తులను పక్కన పెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు, నారా లోకేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ సుపరిపాలనపై బురద చల్లడం, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే రెండు ప్రధాన అజెండాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2024 లో మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రను తిరగరాయడం ఖాయమని, 175 స్థానాలలో వైఎస్సార్ సీపీ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు.

అనంతరం నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న నవరత్నాల కార్యక్రమాలతో పేద‌, మధ్య తరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్ రెట్టింపు ఆనందాన్ని నింపార‌ని తెలిపారు. ప్రభుత్వం ఇస్తోన్న ఈ వ‌రాలు చూసి తట్టుకోలేక రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, శర్మ, తోపుల వరలక్ష్మి, శ్యామ్, నాయక్, నాగుల్ మీరా, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *