-మత్స్య శాఖ కమిషనర్ కలెక్టర్ లతో జూమ్ కాన్ఫరెన్స్
-జిల్లాలో నాన్ ఆక్వా జోన్ పరిధిలోని చెరువులను ఆక్వా జోన్ లోకి మార్పు
-2వ పేజ్ లో ఆక్వా జోన్ కి కన్వర్షన్ చేసిన 229.09 ఎకరాలు
-కలెక్టర్ డా కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం పెంపొందించే దిశలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు డిఎల్ఎస్ లో రెండు ఫేజ్ లో 106 మంది రైతులకు చెందిన 229.09 ఎకరాలను ఆక్వా జోన్ లోనికి మార్పు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ జిల్లా మత్స్య అధికారి కె వి కృష్ణారావు, ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలిసి 2 వ ఫేజ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, మత్స్య రంగాన్ని మరింత ప్రోత్సాహం అందించి మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ఆక్వా రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆదిశలో జిల్లాలో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నట్లు వివరించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో గుర్తించిన 9 మండలాల్లో 29 గ్రామాల్లో 1197.02 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 967.93 ఎకరాలను జిల్లాలోని నాన్ ఆక్వాజోన్ నుంచి ఆక్వా జోన్‌గా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ ఫేజ్ -1 లో ఆమోదించడం జరిగిందన్నారు. నేడు ఫేజ్-2 లో 106 మంది రైతులకు చెందిన 229.09 ఎకరాలను ఆక్వా జోన్ లోకి మార్పు చేస్తూ ఆమోదం తెలపడం జరిగిందని మాధవీలత తెలిపారు. ఇంకా జిల్లాలో 1529 ఎకరాలు నాన్ ఆక్వా జోన్ కింద ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ సభలో ఆమోదం పొందని కారణంగా, గృహ సముదాయాలకు దగ్గర ఉండడం, తక్కువ విస్తీర్ణంలో సాగు, గుర్తింపు కోసం అనుసరించిన ప్రమాణాలు కలిగి ఉండని కారణాలతో అనుమతులు ఇవ్వడం జరగలేదని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్య అధికారి కె వి కృష్ణారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, జిల్లా పశుసంవర్ధక అధికారి ఎస్ టి జి. సత్య గోవింద్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News