రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయనే హెచ్చరికలు నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతొందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్. జవహర్ రెడ్డి, తదితర ఉన్నతాధికారులు ప్రణాళికా రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వైద్య ఆరోగ్యం, మహిళా స్త్రీ సంక్షేమం, పాఠశాల విద్య, స్పందన, గ్రామ, వార్డు సచివాలయ సేవలు, జగనన్న తోడు, గడప గడపకు మనం ప్రభుత్వం తదితర అంశాలపై అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రగతిపై కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియచేస్తూ జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రింద మార్చి మాసంలో ఇప్పటి వరకు 4949 సాధారణ ఓపి చూడడం జరిగిందన్నారు. రక్తపోటు కేసులు 76534 మందిని, మధుమేహం కేసులు 59581 మందిని, గర్భిణీలు (ఏఎన్ సి) 20850 మందిని, బాలింతాలు (పిఎన్ సి) 2666 మందిని, రక్తహీనత గల కేసులను 248 మందిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. వీరికి ప్రభుత్వం పరంగా అవసరమైన ఆహారం, మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సాధారణ జబ్బులు, జ్వరాలు, దగ్గు వంటి లక్షణాలు వివరాలు సేకరణకు ఇంటింటి సర్వే చేపట్టామన్నారు.
జిల్లాలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఐయంఓ ఆదేశాలు మేరకు సన్‌స్ట్రోక్ నిర్వహణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అవసరమైన మందులును సిద్ధంగా అందుబాటులో ఉంచామన్నారు. వృద్ధులు, నవజాత శిశువులు మరియు గర్భిణీ స్త్రీలను ముందస్తు జాగ్రత్తలకు కొరకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన లేబర్ పనులను ఉదయం 11 గంటలకు ముగించి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు పునఃప్రారంభించేలా రీషెడ్యూల్ చేసి, ఆయా ప్రదేశాలలో షేడ్స్ మరియు త్రాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రముఖ ప్రదేశాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఎన్జిఓలు, ఇతర సంస్థలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
6వ విడత జగనన్న తోడు కింద పట్టణ పరిధిలో 4369 , గ్రామీణ ప్రాంతాల్లో 19078 మంది లబ్ధిదారల లక్ష్యం దిశగా కార్యాచరణ అమలు చేయడం జరుగుతున్నట్లు మాధవీలత అన్నారు . జిల్లాలో 77 ఆధార్ నమోదు కేంద్రాలలో 54 ఆధార్ నవీకరణ చేపట్టడం జరుగు తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 9478 మంది వాలటీర్ లకు గాను 9324 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బయో మెట్రిక్, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు శాతం పెంచడం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
మహిళా పోలీస్, వీఆర్వో, విలేజ్ సర్వేయర్లు,ఎనర్జీ అసిస్టెంట్ తో అన్ని పని దినాలలో మధ్యాహ్నం మ.3 గం. నుండి సా.5 గంటల వరకు వరకు గ్రామ,వార్డు సచివాలయాల్లోను, వ్యవసాయ, అనుబంధ రంగ కార్యనిర్వాహకులు ఆర్బీకేల్లోను హాజరై ప్రజలు అందించే అర్జీలను స్వీకరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గడపగడపు మన ప్రభుత్వం లో భాగంగా 1112 సమస్యలు గుర్తించగలిగితే వాటిలో 1031కి సంబంధించి పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందని మిగిలినవి పరిశీలన దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు 3728 మంది విద్యార్థులు 47 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లాలో బరువు తక్కువ గా ఉన్న పిల్లను, హిమోగ్లోబిన్ శాతం తక్కువుగా ఉన్న గర్భణీ స్తీలను గుర్తించి వైయస్ఆర్ ప్రత్యేక పౌష్టి కాహరం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా వైద్య పరంగా 15 అంశాల ప్రగతిపై సమీక్ష చేశారు. ఆమేరకు ప్రగతి సాధించడం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలియచేశారు.
వీడియో కాన్పరెన్స లో సీపీఓ కె.ప్రకాష్ రావు, డిఎల్డిఒ పి. వీణా దేవి, వి.శాంత మణి, ఆర్డబ్యూ ఎస్. ఈ డి.బాల. శంకర్ రావు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా పి ప్రియాంక, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా వసుంధర, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News