రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం కారాగారము లోని ఖైదీల త్రాగునీటి ఉపయోగార్ధం ఓఎన్జీసీ సంస్థ వారు సామాజిక భాద్యతగా ఆర్వో వాటర్ ప్లాంట్ (రివర్స్ ఓస్మోసిస్ ) ను కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందించడం పట్ల కలెక్టరు డా. మాధవీలత అభినందించారు.
సోమవారం ఉదయం నూతన ఆర్వో ప్లాంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, కారాగార సూపరింటెండెంట్ ఎస్. రాజారావు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ప్రతి కార్పోరేట్ సంస్థ సమాజానికి వారు తోచిన రీతిలో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ దిశలో ఒఎన్జీసీ అధికారులు చొరవను కలెక్టరు అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టరు చేతుల మీదుగా రూ. 2,83,200/- విలువైన ఆర్వో (రివర్స్ ఓస్మోసిస్ ) వాటర్ ప్లాంట్ ను కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సెంట్రల్ జైల్ కు బహుకరించారు.
కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ , కోస్టల్ ఆంధ్ర రేంజ్ యం. ఆర్. రవి కిరణ్ సారధ్యం వహించి ఓఎన్జీసీ సంస్థ వారు ఖైదీల సంక్షేమం కొరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరపాలి అని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం లో విశిష్ట అతిధులు ఓఎన్జీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ నారాయణ్, చీఫ్ జనరల్ మేనేజర్ నవెద్ రావు, జనరల్ మేనేజర్ ఎన్. పి. జగనాధ రావు, సి.యస్.ఆర్. డిప్యుటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ (సి.యస్.ఆర్ – ఇంచార్జ్), సి.యస్.ఆర్. , చీఫ్ మేనేజర్ శ్రీమతి నిర్మల రాబర్ట్ లతో పాటు కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్స్ యం. రాజ కుమార్, ఎస్. కమలాకర్, జైలర్స్, కే.వి. రామారావు, జి. వెంకట రమణ , కే. దుర్గా రమేష్, కే. సురేష్ కుమార్, సి.హెచ్. రమేష్, డిప్యూటీ జైలర్స్ మరియు కారాగార వైద్యులు . డా. పి. కోమల, డా. హరికా, డా. రవి కుమార్ , సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News