అత్యం ఘనంగా తూర్పుగోదావరి జిల్లా తొలి ఆవిర్బావ దినోత్సవ వేడుకలు..

-హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మేల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, రుడా చైర్ పర్సన్ షర్మిలారెడ్డి, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు.
-వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జిల్లా కలెక్టరు మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చారిత్రాత్మకమైన నిర్ణయంతో సమర్థవంతంగా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాల ఆవిష్కరణ సత్ఫలితాలను అందిస్తున్నాయని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.

మంగళవారం స్థానిక ఆనం కళా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లా తొలి ఏడాది ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయడం జరుగుతోందని అన్నారు. ప్రజలకు మరింత సుపరిపాలన అందించే క్రమంలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. ఆదిశలో చిన్న జిల్లాలు ఏర్పాటు ద్వారా రాజమహేంద్రవరం కేంద్రంగా పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 19 మండలాలతో నూతన తూర్పుగోదావరి జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ఏడాది ఇదే రోజున తొలి జిల్లా కలెక్టర్ గా మాధవీలత భాద్యతలు చేపట్టి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఆదర్శంగా నిలడం పట్ల హోం మంత్రి అభినందనలు తెలిపారు. నిబద్ధత కలిగిన అధికారిణిగా సమన్వయం చేసుకోవడం ఎలాగో చూపించడం ఆమె ప్రత్యేకతకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జిల్లాలో జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. చిరు ధాన్యాలు ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో స్టాల్స్ ఏర్పాటు చెయ్యడం ద్వారా అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో తనదైన ముద్రను కలెక్టరు వేయడం అభివృద్దికి సూచిక అన్నారు. గతంలో ఏ సమస్య వచ్చినా సుదీర్ఘమైన కాకినాడ ప్రయాణం చేసి వెళ్ళవలసి వచ్చేదన్నారు. నేడు జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రజలకు మరింత చేరువలో ఉండటంతో పాలనా పరంగా జిల్లా కలెక్టరు, మాధవీలత, భద్రతా పరంగా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యలు త్వరిత గతిన పరిష్కరిస్తు ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని అభినందించారు.

జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయం సాధించడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నా నన్నారు. జిల్లా లో పరిపాలన సజావుగా జరగడంలో పాలనా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం మద్య సమన్వయం ఎంతో కీలకమన్నారు. శాంతి భద్రతలను నిర్వహించడంలో ఎస్పీ సుధీర్ కుమార్, జిల్లాలో చక్కటి పరిపాలన అందించడంలో జాయింట్ కలెక్టరు సహకారం పై కలెక్టరు వారి పనితీరును ప్రశంసించారు. గత ఏడాది ఎదుర్కొన్న సమస్యలను అధిగమించి ముందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఆ సవాళ్ళ నుంచి ఉత్తేజం పొంది జిల్లాను మరింత అభివృద్ధి సాధించడం ఇదే తరహా తోడ్పాటును అధికారులు అందించాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. నూతన తూర్పు గోదావరి జిల్లాలో పారిశ్రామిక పరంగా, పర్యాటక కేంద్రంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లా పరిధిలో ఉన్న ఏడు నియోజక వర్గాలకు చెందిన ఎంఎల్ ఏ లు, ఎమ్ ఎల్ సి లు, తూర్పు గోదావరి ఎంపి, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు ద్వారా ఎంతో సహకారం లభిస్తోందన్నారు. ఎంతో విలువైన సూచనలు ఇచ్చి జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చి సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచేందుకు ఇదే తరహాలో సహకారం కొనసాగించాలని కోరారు. జిల్లాను మద్యపాన రహిత, మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా తీర్చి దిద్దే క్రమంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించామన్నారు. నేడు జిల్లాలో 100 ఔత్సహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.3.56 కోట్ల సబ్సిడీ తో కూడిన బ్యాంకు రుణాలు అందించడం ద్వారా నూతన పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరిగిందన్నారు.

ఇటీవల దేశవ్యాప్తంగా 139 ఐఏఎస్ లు పాల్గొన్నశిక్షణా తరగతుల్లో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ తన ప్రతిభతో బ్యాచ్ మొత్తానికి మొదటి స్థానాన్ని నిలచి తూర్పుగోదావరి జిల్లా ఖ్యాతిని దేశానికి చాటడం పట్ల హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టరు మాధవీలత సభా వేదికపై నుండి అభినందలనులు తెలిపారు.

గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలో నియోజక వర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించేదుకు కలక్టరు చొరవ తీసుకున్నారన్నారు. ప్రజలకు మరింత సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చిన్న జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ప్రభుత్వమే ప్రజల ముంగిటకు వచ్చిందన్నారు. నేడు నూతనంగా జిల్లా ఏర్పడి ఏడాది కాలం పూర్తియినందువ వేడుకుల నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం పట్ల విద్య వైద్యానికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో అర్థమవుతుందన్నారు. గతంలో పెద్ద జిల్లాలు ఉండటం వలన ప్రజా సమస్యలు పరిష్కారం కొంత ఇబ్బందులు ఉండేవని నేడు చిన్నజిల్లాలుగా ఏర్పడటం వలన ఆపరిస్థిలు లేకుండా ప్రజా సమస్యలు వెనువెంటనే పరిష్కారం అవుతుందన్నారు. ఈ విదానంలో కలెక్టరు చక్కటి తోడ్పాటునందిస్తున్నారన్నారు.

రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజమహేంద్రవరం కేంద్రంగా నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా గత ఏడాదిగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని రంగాల్లో ముందడగు వేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి చారిత్రాత్మకంగా ఆద్యాత్మకంగా ఎంతో విశిష్ఠత ఉందని ఇక్కడ పుట్టడం అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావిస్తారన్నారు. తాను రాజమహేంద్రవరం గడ్డమీద పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నూతనంగా జిల్లా కలెక్టరు కార్యాలయం ఏర్పడిన అనతి కాలంలోనే 3,4 దశాబ్దాలుగా తన నియోజకవర్గ పరిధిలో అపరిష్క్రతంగా ఉన్న ఎన్నో సమస్యలకు గత ఏడాది కాలంలోనే పరిష్కారం లభించాయన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కలెక్టరు ఇందుకు సహరించిన అన్నివిధాల అండగా నిలిచిన ముఖ్యంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. జిల్లాలో ఎటువంటి వివక్షాలకు తావు లేకుండా పాదరర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలను వాలంటీరు, సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్దిదారులకు, ప్రజలకు ఇంటి వద్దకే అందిస్తున్నామని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ జిల్లా అభివృద్దిపై ప్రతిజ్ఞ చేయించారు. సభ నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టిన నగరపాలక సంస్థ కమీషనరు కె. దినేష్ కుమార్ అత్యంత విజయవంతంగా ఏడాది వేడుకల సభాకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, డిఆర్వో జి.నరశింహులు తోపాటు రెవెన్యూ, పోలీసు, అన్ని శాఖల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *