రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల, సంగీత కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. హోం మంత్రి తానేటి వనిత, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్ పర్సన్ షర్మిలారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ వైస్ చైర్ పర్సన్ పోసిన శ్రీలేఖ,పలువురు కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు,శాసనసభ్యులు జక్కంపూడిరాజా, తలారి వెంకట్రావు, జిల్లా కలెక్టరు మాధవీలత, ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, ఐటీడిఏ పిఓ ప్రవీణ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్. పంకజ్ కుమార్ మీనా తదితరులు వీక్షిచడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా డి.జయ వ్యవహరించగా మొదటిగా సూర్యదీప్ విద్యార్థులచే స్వాగతం.. సుస్వాగతం.. గాంధిపురం మున్సిపల్ హైస్కూలు విద్యార్థులచే మేము గోదావరివాళ్ళమండి.. సూర్యదీప్ విద్యార్థులచే వేదంలోఘోషించే గోదావరి.. రాజమహేంద్రవరం చరిత్రను ఆవిష్కరిస్తూ నృత్యం ప్రదర్శన జరిగింది. ప్రభుత్వం సంగీత కళాశాల విద్యార్థులు తెలుగు వైభవం పై భరత నాట్యం, గాంధిపురం మున్సిపల్ హైస్కూలు వారు వేధంలా ఘోషించే నృత్యరూపకం, ఢిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థుల చే, ఈశ్వర్ మాష్టరు బృదం ఆధ్వర్యంలో నాటు.. నాటు.. పాటకు నృత్యాన్ని ప్రదర్శించారు.
ఆకట్టుకున్న సమాచార శాఖ ఏర్పాటు చేసిన పోటో ప్రదర్శన..
జిల్లాలో గత ఏడాదిగా జరిగిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ముఖ చిత్రంగా, రాజమహేంద్రవరం ప్రాశ్చిత్యాన్ని తెలిపే విధంగా చారిత్రిక ఆధారమైన పోటోలతో కూడిన ఛాయాచిత్ర ప్రదర్శన కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణీయంగానిలిచింది. హోం మంత్రి, జిల్లా కలెక్టరు ఇతర ప్రజాప్రతినిధులు వివిధ సందర్భాల్లో గత ఏడాదిగా జగిగిన కార్యక్రమాలను ఒక సారి పునరాలోచన చేసుకోవడం విశేషం. సుబ్రహ్మణ్యం మైదానంలో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజారు, ఐసీడీఎస్ స్టాల్స్ లను, ఆవరణలో ముగ్గులను ముఖ్యఅతిధులు పరిశీలించి అభినందనలు తెలియజేసారు. ఐసీడీఎస్ స్టాల్ లో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాలను రుచి చూసారు.
Prajavartha Online Telugu News