విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు రామాంజనేయులు మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి బిసి సామాజిక వర్గంలోని పనిచేస్తున్న వివిధ చేతివృత్తుల పనివాళ్ళు కలిశారు. సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి తన్నీరు. రామాంజనేయులు ఇటుక బట్టీల యూనియన్ ప్రెసిడెంట్ బాబురావు తో కలిసి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ కులాలకు చెందిన బీసీలు చాలామంది చేతి పని వారు ఉన్నారని పని వారిలో వృద్ధాప్యంలో ఉన్న వారు అనారోగ్యంతో ఉన్నవాళ్లు కూడా ఉన్నారని వాళ్ళను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని వారి పిల్లల విద్యాభ్యాసంలో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వారు కార్పొరేట్ స్కూల్లో కాలేజీలు వారు వాళ్ళని గుర్తించి ఆదుకోవాలని ఆ దిశగా బీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు రామాంజనేయులు తమ ప్రయత్నం చేస్తానని నియోజకవర్గంలో ఇటుక బట్టీలలో పని చేస్తున్న వారిసమస్యలు కొన్ని యూనియన్ ప్రెసిడెంట్ బాబురావు దృష్టికి తీసుకెళ్లగా ఇటుగా బట్టీలు లో పనిచేస్తున్న కార్మికులందరినీ తమ కుటుంబ సభ్యులు లాగా అన్ని బట్టీల యజమానులు వారి బాగోగులు చూడాలని ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని అన్నారు.
Prajavartha Online Telugu News