
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో గుంటూరు సుభాని హోటల్ నూతనంగా రెండవ బ్రాంచ్ ఎస్‌ఎస్ కన్వెన్షన్ దగ్గర, డా॥ వై.వి.రావు హాస్పటల్ రోడ్, ఎం.జి.రోడ్డు, విజయవాడనందు ప్రారంభించబడిరది. ఆదివారం ప్రారంభించబడిన సందర్భంగా హోటల్ మేనేజర్ జి.మాధవీలత మాట్లాడుతూ మా హోటల్ యజమాని, నిర్వాహకులు విజయభాస్కర్ మా కస్టమర్ల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని నాణ్యతా ప్రమాణాలు మరియు పరిశుభ్రతను అనుసరిస్తారని తెలిపారు. మా సంస్థ హలాల్ మరియు ఐఎస్‌ఓ 9001:2015 క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సర్టిఫై చేయబడిరదన్నారు. మేము అన్ని ఆహార పదార్థాల తయారీకి స్వచ్ఛమైన నెయ్యి, సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్, తాజా మాంసం మరియు కూరగాయలను మాత్రమే ఉపయోగిస్తామన్నారు. మేము స్వచ్ఛమైన నెయ్యితో కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ బిర్యాని మరియు మటన్ బిర్యాని, కిచిడి/రాగి సంగటి నాటుకోడి, నెల్లూరు చేపల పులుసు, తలకాయ, మటన్ కబాబ్, పరోటా/దోశతో చికెన్/పాయ, మటన్/నాటుకోడి కర్రి, తదితర వంటకాలతోపాటు కర్డ్ రైస్, పెరుగు, లస్సీ, శీతలపానీయాలు కూడా లభ్యమవుతాయన్నారు. ఆన్‌లైన్ ఆర్డర్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. ఆటోనగర్‌లోని మొదటి బ్రాంచిని అభిరుచిగల కస్టమర్ దేవుళ్ళు ఆదరిస్తున్నారని ఈ రెండు బ్రాంచిని కూడా ఆదరించాలని కోరారు. భవిష్యత్‌లో మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. సరికొత్త రుచులతో, అతి తక్కువ ధరలతో, నాణ్యమైన వివిధ రకాల వంటకాలను అందిస్తున్నామని నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News