విజయవాడ నగరంలో బాహుబలి ఎగ్జిబిషన్ సందడి


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో శాతవాహన కాలేజీ మైదానంలో భారీ సెట్టింగ్ లతో ఏర్పాటు చేసిన బాహుబలి ఎగ్జిబిషన్ ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. సినిమాలకే పరిమితమైన సెట్టింగ్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనిత ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో శాతవాహన కాలేజీ ప్రాంగణంలో బాహుబలి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారని తెలియజేశారు. సెంట్రల్ నియోజవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. తదనంతరం ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసిన బాహుబలి సెట్టింగ్లను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు బాహుబలి సినిమా సెట్టింగ్ చూడాలంటే హైదరాబాదు వెళ్లవలసిన పరిస్థితి వచ్చేదని ఇప్పుడు బాహుబలి సెట్టింగ్ లతో నగరంలోనే ప్రారంభించారని తెలియజేశారు.అచ్చు గుద్దినట్టు బాహుబలి సినిమాలోని శివగామి సింహాసనం, సైనికులు ప్రభాస్ సైనిక వేషధారణ వంటి అనేక చిత్రాలతో ఎగ్జిబిషన్ ఆహుతులను అలరిస్తున్నదని చెప్పారు.
తధనంతరం నిర్వాహకులు ఎన్ గోపీనాథ్ బాహుబలి సెట్టింగ్ విజయవాడ వాసులను ఎంతగానో అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి నగరవాసుల కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని ఎగ్జిబిషన్లోని సెట్టింగులు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు ఆశ్చర్య చెకితులను చేస్తాయని ఆయన పేర్కొన్నారు. బాహుబలి ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డ్యాన్స్, చిన్న పిల్లల ఆటవస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక
ఆకర్షణగా నిలుస్తూ.. ఇటు చిన్నారులు, అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటూ ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.కలకత్తా జైపూర్ ఢిల్లీ మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారని పేర్కొన్నారు. పాఠశాలలో కళాశాలలో ఇంకొక పక్షం రోజుల్లో ముగిసి ఉండటంతో ఈ బాహుబలి ఎగ్జిబిషన్ నగరవాసులను ఎంతగానో అలరిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసిపి కార్పొరేటర్ కుక్కల అనిత, శాతవాహన కాలేజ్ కరెస్పాండెంట్ నిడుమోలు రమా సత్యనారాయణ , నిర్వాహకులు భాను, కిరణ్, అడపా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *