రబీ 2022-23 ధాన్యం కొనుగోలు పై డివిజన్ స్థాయి శిక్షణా తరగతులు

-ఆనంకళా కేంద్రంలో రెండు సెక్షన్లు గా సాంకేతిక శిక్షణ
-జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2022-23 రబీకి కేంద్రీకృత వరి సేకరణ పై క్షేత్ర స్థాయి సిబ్బందికి సాంకేతిక పరమైన శిక్షణా తరగతులను ఏప్రిల్ 11 మంగళ వారం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆనం కళా కేంద్రంలో మంగళవారం ఉదయం 10.30 నుంచి మ.1.00 గంటవరకు రాజమండ్రి డివిజన్ పరిధిలోని, మ.2.30. నుంచి సా 5.00 వరకు కొవ్వూరు డివిజన్ పరిధిలోని సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహయకులు, సాంకేతిక సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇతర సిబ్బందికి రబీ సేకరణపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు సహాయ పౌర సరఫరాల అధికారి, సి ఎస్ డి టి, కస్టోడియన్ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల , గ్రామ వ్యవసాయ అధికారులు, సిబ్బంది తో పాటుగా ఇతర అనుబంధ సిబ్బందికి రబీ సేకరణ పై ముందస్తు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 2022-23 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన నూతన మార్ఘ దర్శకాలు మేరకు సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన లక్ష్యంగా మంగళ వారం నిర్వహిస్తున్న అంశాలపై అవగాహన కల్పిస్తామని తేజ్ భరత్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *