తూర్పు గోదావరి జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గా వి. నాగార్జున రెడ్డి పదవీ బాధ్యతలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గా వి. నాగార్జున రెడ్డి గురువారం ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉదయం బాధ్యత లు చేపట్టిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన నాగార్జున రెడ్డి 2007 లో డిప్యూటీ తహశీల్దార్ గా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం సిఎం కార్యాలయం లో తహశీదార్ హోదాలో విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పై తూర్పు గోదావరి జిల్లా కు జిల్లా మేనేజర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అయిందని, ఈ దృష్ట్యా ఎంతో జవాబుదారీ తనం తో కూడి పని తీరు చూపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *