-సిఎం ఆశాయలకు అనుగుణంగా ఫలితాలు సాధించాలి
-రానున్న ఖరీఫ్ లో రైతులకు పంటల విషయమై మరింత అవగాహన కల్పిస్తాము
-ప్రజా ప్రతినిధుల పట్ల అధికారులు జవాబుదారీతనం ఉండటం ముఖ్యం
-రబీ సీజన్ లో రైతులకు మద్దతు గా నిలవడం జరిగింది
-అకాల వర్షాలు కురిసినా సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్నాం
-జూన్ ఒకటవ తేదీన సాగునీరు విడుదల చేస్తాం
-ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలన సౌలభ్యం కొరకు వికేంద్రీకరణ దిశగా, సంక్షేమ పథకలతో కూడిన వ్యవస్థ ద్వారా ప్రజలకు రైతులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేయడం లో జిల్లా యంత్రాంగం సఫలీకృతమైందని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.
స్థానిక కలెక్టరేట్ లో బుధవారం ఉదయం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం మరియు జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీ సమావేశం జిల్లా ఇంఛార్జి మంత్రి అధ్యక్షతన జరిగింది. తొమ్మిది అంశాల అజెండా గా ఉపాధిహామీ, విద్య నాడు – నేడు, హౌసింగ్, పౌర సరఫరాలు ధాన్యం సేకరణ, వ్యవసాయం, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, వైద్య & ఆరోగ్యం అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా, జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్ ఎస్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలోజిల్లాలో చేపట్టి అమలు చేస్తున్న పలు అభివృద్ధి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల లో జిల్లా యంత్రాంగం రెండు లక్షలు మెట్రిక్ టన్నులు సేకరించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ లో సుమారు లక్ష మెట్రిక్ టన్నులు విక్రయించగా, ఇంకా మరో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టవలసి ఉందన్నారు..ఈ ఏడాది రబీ లో మెరుగైన దిగుబడి వచ్చిందని, అకాల వర్షాలు కారణంగా కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడినా, ప్రభుత్వం తీసుకున్న చర్యల, జిల్లా యంత్రాంగం ద్వారా ఇప్పటి వరకూ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు.
జిల్లాలో 100 రోజుల కనీస పని దినాలు కల్పించడం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన మరింత గా పనిదినాలు కల్పించాలని కోరారు. గత ఏడాది 10,394 కుటుంబాలకు 100 రోజుల ఉపాధిహామీ పని దినాలు కల్పించారని, వాటిని మరిన్ని కుటుంబాల కు పెంచాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.
ప్రాధాన్యత భవనాలు కింద 390 గ్రామ సచివాలయాలను రూ.150.20 కోట్ల తోకి గాను 327 పూర్తి చేశామని, 61 ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. అర్భికే లు కు చెంది 373 భవనాలను రూ.81.02 కోట్లతో చేపట్టగా, 268 పూర్తి అయ్యాయని, 98 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ యూనిట్స్ భవనాలు వివరాలు తెలియ చేశారు. మిగిలిన ఆయా భవనాలు నిర్మాణం పనులు పూర్తి చెయ్యాలని మంత్రి ఆదేశించారు. ఐ ఐ టి లో చేరే వారిలో కొందరు డ్రాప్ అవుట్ అవ్వడం జరుగుతోందని, వారిలో నైపుణ్య బోధన పద్ధతులను ఆచరించాలని పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం పై దృష్టి పెట్టాలని ఇందుకోసం 8,9,10 విద్యార్థులను పరిగణన లోకి తీసుకోవాలని మంత్రి సూచించారు.
నాడు నేడు పనులకు సంబంధించిన పెండింగ్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి వేణుగోపాల్ ఆదేశించారు. జూన్ 11 లోగా పనులు పూర్తి చేసి, 3వ దశ కి చెందిన 406 పనులకు సంబంధించి వ్యక్తిగత శ్రద్ద తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందచేసిన కంప్యూటర్ వినియోగం పై దృష్టి పెట్టాలని, ప్రతి విద్యార్థి ఆమేరకు ఎంత మంది వాడుతున్నారో డేటా ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్స్, కళాశాల స్థలాల విషయంలో రీ సర్వే చేపట్టి విద్యా పరమైన సంస్థలు కోసం వినియోగించాలని సూచించగా, ఆమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు.
ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని మంత్రి సి హెచ్ వేణుగోపాల కృష్ణ తెలిపారు. రానున్న వర్షాకాలం కింద ప్రజల్లో అవగాహన అవసరం అన్నారు. ప్రజా ప్రతినిదులు సమక్షంలో ప్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ ను తీసుకుని వెళ్ళాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం అన్నారు. పేద వారి వద్దకు వైద్య సేవలు తీసుకుని వెళుతున్నామని వాటి లక్ష్యసాధన మంచి ఫలితాలు ఇవ్వాలని పేర్కొన్నారు
హౌసింగ్ పై సమీక్ష చేస్తూ, జిల్లాలో 68074 ఇంటి నిర్మాణాలు లక్ష్యం కాగా, 58,916 నిర్మాణాలు ప్రారంభించి, 17571 పూర్తి చేశామని మంత్రి వేణుగోపాల్ కృష్ణ తెలిపారు.
గృహ నిర్మాణానికి గుర్తించిన కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనుల వేగవంతం చేయాలని ఎంపి మార్గని భరత్ రామ్ కోరారు. కొందరు కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనులలో తీవ్ర జాప్యం జరుగుతోందని, వారి ద్వారా పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. వెలుగుబంద లే అవుట్ లో మోడల్ అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చెయ్యాలని తెలియ చెయ్యగా, కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధాన రహదారి నుంచి బిటి రోడ్ వెయ్యడం జరిగిందని అన్నారు.
అనంతరం పౌర సరఫరాల అంశంపై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, 51 వేల హెక్టార్ల లో కోతలు పూర్తి చేశారని తెలిపారు. జిల్లాలో 93 శాతం కోతలు పూర్తి అయ్యాయని, ఇప్పటి వరకు ప్రభుత్వం 1.98 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ, బహిరంగ మార్కెట్ లో 1.22 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలు కారణంగా జిల్లాలో 277 రైతులకి చెందిన 230 హెక్టార్ల ప్యాడి డ్యామేజ్ అయినట్లు ఎన్యూమరేషన్ పూర్తి చేశామని తెలిపారు. మొక్కజొన్న, మినుములు వంటివి చాలా తక్కువ స్థాయి లో డ్యామేజ్ అయినట్లు గుర్తించినట్లు, ఎన్యూమ రేషన్ చేశామని తెలిపారు.
వ్యవసాయం ఖరీఫ్ లో 79639 హెక్టార్ల సాగు విస్తీర్ణం అంచనా వేశామని, 80 శాతం విత్తనాలు రైతులు సమకూర్చుకోవడం జరుగుతుందని, జిల్లాలో విత్తన కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఖరీఫ్ సాగు కు అవసరమైన ఎరువులు సేకరించినట్లు అధికారులు వివరించారు. ఖరీఫ్ లో 79,739 హెక్టార్ల లో వరి , బ్లాక్ గ్రామ్ 2406 హెక్టార్ల లో, మొక్క జొన్న ఇతర పంటలు 650 హెక్టార్ల లో వెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 67,283 మంది కౌలు రైతులు ఉన్నారని, మొత్తం 99,255 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా మార్చి నాటికి ఆర్భికె 16,595 ఎమ్ టి మేరకు సమీకరించడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తున్నామని, ఆమేరకు యంత్ర సేవా పథకం అమలులో మరింత నిబద్దత చూపాల్సి ఉంటుందని, ఆమేరకు రైతుకు అవగాహన అవసరం అని మంత్రి వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. పంట సాగు చేసే సమయంలో ఏ పంట అధిక దిగుబడి వస్తుందో రైతుకు అవగాహన అవసరం అన్నారు. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, వంటి వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. ఇరిగేషన్ కాలువల్లో తూడు తొలగింపు ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి, ఆ పనులు సకాలంలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. జూన్ ఒకటి నుంచి కాలువలకు నీరు విడుదల కానున్న నేపథ్యంలో సంబందించిన పనులు పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. ఇరిగేషన్ – వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని అన్నారు.
ఇరిగేషన్ శాఖ తరపున కాటన్ బ్యారేజి ఆధునీకరణ పనులు కోసం రూ.62 కోట్ల తో ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. పొట్టిలంక గ్రామంలో 5 కోట్ల తో, మద్దూరు లంకలో రూ.10 కోట్ల పనులకు, బోబ్బిర్లంక లో రూ .24 లక్షల తో, రాజానగరం పరిధిలో స్థానిక శాసన సభ్యులు సూచనలతో జల్ల కాలువ కు రూ.4.98 కలెక్టర్ చోరవతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, 2023-24 కి సంబంధించి ఉపాధిహామీ పథకం అమలు లో ఉపాధిహామీ కింద చేపట్టనున్న పనులు కి సంబంధించి సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. మెటీరియల్ కాంపోనేంట్ కింద చేపట్టవలసిన పనులు కూడా గుర్తించి ఆమేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భోధన పరమైన అంశాలు పై ప్రత్యేక దృష్టి మరింతగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజానగరం మండలంలో అమృత్ సరోవర్ కింద చెరువుల అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. సభ్యులు సూచించిన ప్రతిపాదనలు, సూచనలు పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుందని, మినిట్స్ లొ వాటిని నమోదు చెయ్యడం జరుగుతుందని అన్నారు.
అనంతరం పౌర సరఫరాల జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, 51 వేల హెక్టార్ల లో కోతలు పూర్తి చేశారని తెలిపారు. జిల్లాలో 93 శాతం కోతలు పూర్తి అయ్యాయని, ఇప్పటి వరకు ప్రభుత్వం 1.98 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ, బహిరంగ మార్కెట్ లో 1.22 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలు కారణంగా జిల్లాలో 277 రైతులకి చెందిన 230 హెక్టార్ల ప్యాడి డ్యామేజ్ అయినట్లు ఎన్యూమరేషన్ పూర్తి చేశామని తెలిపారు. మొక్కజొన్న, మినుములు వంటివి చాలా తక్కువ స్థాయి లో డ్యామేజ్ అయినట్లు గుర్తించినట్లు, ఎన్యూమ రేషన్ చేశామని తెలిపారు.
గృహ నిర్మాణానికి గుర్తించిన కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనుల వేగవంతం చేయాలని ఎంపి మార్గని భరత్ రామ్ కోరారు. కొందరు కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనులలో తీవ్ర జాప్యం జరుగుతోందని, వారి ద్వారా పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. వెలుగుబంద లే అవుట్ లో మోడల్ అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చెయ్యాలని తెలియ చెయ్యగా, కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధాన రహదారి నుంచి బిటి రోడ్ వెయ్యడం జరిగిందని అన్నారు.
శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, నియోజక వర్గంలో అర్హులైన వారికి జలకళ పనులను చేపట్టాలని కోరారు. ఆరోగ్య భవనాలు, బల్క్ మిల్క్ భవనాలు కోసం ఖర్చు చేసిన అదనపు నిధులు మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్సీ బి. ఇజ్రాయెల్ మాట్లాడుతూ, సదరన్ ద్రువపత్రలు జారీ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా ప్రతినిదులు ఏదైనా సమాచారం కోరితే స్పందించడం లేదని ఆరోపణ చేసి, సమావేశం దృష్టికి తీసుకుని రాగా వివరణ కోరిన, తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి వేణు ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
గోకవరం మండలంలో ఇంటి స్థలాలు కోసం ఉన్న అర్జిల కోసం 23 చోట్ల స్థలాలు సేకరణ చేపట్టాల్సి ఉందని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమావేశం దృష్టికి తీసుకుని రాగా, చర్యలు తీసుకుంటామని కమిటీ చైర్మన్ తెలిపారు.
స్కూల్స్ ప్రారంభించే నాటికి పుస్తకాలు, ఇతర అనుబంధ మెటీరియల్ విద్యార్థులకు చేరేలా చూడాలని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వర రావు సూచించారు.
వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్, జిల్లాలోని 37 పిహేచ్ సి . లలో, అన్ని వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ లో చేపడుతున్నామని తెలిపారు. మండల స్థాయి లో గైనకాలజిస్టు, అర్థో ఫిజిషియన్ డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రబాబు కోరారు. పి హెచ్ సి పరిధిలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయాలని తెలియచేశారు.
సమావేశంలో జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పరి వేణుగోపాలరావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్ పి మార్గాని భరత్ రామ్, ఎమ్ ఎల్ సి లు వంకా రవీంద్రనాద్, ఇళ్ళ వెంకటేశ్వరరావు, అనంత ఉదయభాస్కర్, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, జ్యోతుల చంటిబాబు, డిసిఎమ్ఎస్ చైర్ పర్సన్ ఎస్.మణికుమారి, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కే.దినేష్ కుమార్, డి ఆర్వో జి. నరసింహులు, ఆర్డీఓలు ఏ. చైత్రవర్షిణి, ఎస్. మల్లిబాబు, డ్వామా పిడి జి ఎస్ . రామగోపాల్, పంచాయితీ రాజ్ ఎస్ఈ ఏ బి వి ప్రసాద్,డిఈఓ ఎస్ అబ్రహం, జిల్లా హౌసింగ్ అధికారి జీ.పరశురామ్, ఇంఛార్జి డి ఎస్ఓ పి. ప్రసాదరావు, జిల్లా వ్యవసాయ శాఖధికారి ఎస్. మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి వి. రాధాకృష్ణ, ఏపీ ఎమ్ఐపి పి.డి ఎస్. రామమోహన్, ఐ సి డి ఎస్ పిడి కే. విజయలక్ష్మి, డిపిఓ పి. జగదాంబ, డిఆర్డిఏ ఎస్.సుభాషిణి, ఎస్ ఈ ట్రాన్స్ కో టివిఎస్ఎన్ మూర్తి, డీల్ డి ఓ పి. వీణాదేవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News