-జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2,026 మంది లబ్ధిదారులకు సుమారు 1254.93 ఎకరాలు అసైన్డ్ భూములకు చెందిన వ్యవసాయ, లంక భూమి పట్టాలు జారీ చేయడం జరిగిందని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ లో అసైన్మెంట్ కమిటీ సమావేశంకు మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో సుదీర్ఘకాలంగా సాగు చేస్తున్న అర్హులైన వారికి అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తూ వారికి పట్టాలు అందచెయ్యడం జరుగుతుందన్నారు . ఈ ప్రక్రియ పూర్తి చేసే దిశలో జేసీ తేజ్ భరత్ కృషి అభినందనీయం అని మంత్రి అన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగులో అసైన్డ్ భూములు సమస్య పరిష్కారం కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ఆగస్టు నెలలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో అసైన్డ్ భూములు అధీనంలో ఉన్న వారిని మండలాలు వారీగా గుర్తించినట్లు పేర్కొన్నారు. అసైన్‌మెంట్‌కు అవకాశం ఉన్న అన్ని ఖాళీ వ్యవసాయ ప్రభుత్వ భూములను ధృవీకరించి ఆమేరకు పట్టాలు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు. అన్ని షివాయ్ జామీదార్ కేసులను ధృవీకరించిందని మరియు అర్హత ప్రకారం పోర్టల్ లో చేర్చడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. పట్టా ఇవ్వటమే కాకుండా, సబ్ డివిజన్ స్టేట్మెంట్ తో కూడి పట్టాలు జారీ చెయ్యడం జరిగిందని జేసీ పేర్కొన్నారు. మండల వారీగా ఆయా భూముల గుర్తించి మార్గదర్శకాలు మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వ్యవసాయ భూములకు చెంది కొవ్వూరు డివిజన్ లో 518 మంది కి 470.30 ఎకరాలు, రాజమండ్రీ డివిజన్ లో 793 మందికి 573.664 ఎకరాలు వ్యవసాయ భూమిని, లంక భూములకు సంబంధించిన 715 మందికి 210.97 ఎకరాలు కి చెందిన పట్టాలు జారీ చేశామని జేసీ పేర్కొన్నారు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసైన్డ్ భూములు పంపిణీ జరిగిందని, మళ్ళీ ఇప్పుడు చేయడం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పరి వేణుగోపాలరావు, ఎంపిలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గని భరత్, ఎమ్ ఎల్ సి లు వంకా రవీంద్రనాద్, ఇళ్ళ వెంకటేశ్వరరావు, అనంత ఉదయభాస్కర్, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, జ్యోతుల చంటిబాబు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, డిసిఎమ్ఎస్ చైర్ పర్సన్ ఎస్.మణికుమారి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కే.దినేష్ కుమార్, డిఆర్వో జీ. నరసింహులు, ఆర్డీఓలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్రవర్షిణి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News