నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

-జిల్లా సూక్ష్మ సేద్య అధికారి ఎస్. రామమోహన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2023-24 ఆర్దిక సంవత్సరమునకు ౩౦౦౦ హెక్టార్లు లక్ష్యంగా డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించడం జరిగినదని జిల్లా సూక్ష్మ సేద్య మరియు ఎ.పి.ఎం.ఐ.పి. అధికారి ఎస్. రామ మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎంపిక చేయబడిన 11 డ్రిప్ కంపెనీలలో, డ్రిప్ పరికరాలు అమర్చుటకు ఫిట్టర్స్ కొరత ఉన్నందున నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కావున పదవ తరగతి ఉత్తీర్ణులు అయ్యి 18 సంవత్సరములు నిండిన ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఈ నెల 17 వ తేదీ శనివారం (27-05-2023) లోగా జిల్లా సూక్ష్మసేద్య అధికారి, వై.టి.సి. బిల్డింగ్, రూరల్ తహసిల్దార్ కార్యాలయం ప్రక్కన, బొమ్మూరు, రాజమహేంద్రవరం వారి కార్యాలయంకు పోస్ట్ ద్వారా గాని, చరవాణి ద్వారా (7995009886/ 85) గాని దరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా సూక్ష్మ సేద్య మరియు ఎ.పి.ఎం.ఐ.పి. అధికారి ఎస్. రామమోహన్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *