-అభినందించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంతోమంది నిరాశ్రయులైన పేద, అనాథ, అంధ విద్యార్థులతో పాటు వివిధ రకాల అణగారిన(Deprived) వర్గాల పిల్లలకు పూర్తి ఉచితంగా విద్యా, వసతి కల్పించి ఉద్యోగంలో స్థిరపడేంత వరకు సౌకర్యాలు కల్పిస్తున్న అగిరిపల్లె ‘హీల్ (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్) స్వచ్ఛంద సంస్థకు స్కూల్ లీడర్ షిప్ ట్రైనింగ్ రిసోర్సు పర్సన్లు రూ. 2 లక్షల 10 వేలు విరాళాన్ని అందించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సమగ్ర శిక్షా, స్యీమాట్ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 24 వరకు జరిగిన స్కూల్ లీడర్ షిప్ శిక్షణా కార్యక్రమంలో అనేక జిల్లాల నుంచి పాల్గొన్న రిసోర్సు పర్సన్లు కలిసి తమవంతు సాయంగా ఈ విరాళాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్న ఉపాధ్యాయులందరినీ మనస్పూర్తిగా సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. దీనికి సంబంధించిన చెక్కును స్యీమాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య హిల్ సంస్థ ప్రెసిడెంట్ లక్ష్మి, సీఈవో అజయ్ కుమార్ లకు అందించారు.
Prajavartha Online Telugu News