-ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ, హార్టికల్చర్ రంగం లోని 1052 మంది రైతులకు రూ.102.20 లక్షలు నగదు బదలీ
-ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్, హోం మంత్రి తానేటి వనిత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా 1,35,867 మంది రైతు సోదరుల ఖాతాలో సాగుబడి పెట్టుబడి సహాయం కింద 2023-24 ఏడాదికి చెందిన తొలి విడత రైతు భరోసా సొమ్ము 102 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద 1052 మందికి 102 లక్షలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ, హోం మరియు ప్రకృతి విపత్తుల శాఖ మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.
గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి రాష్ట్ర స్థాయి రైతు భరోసా, పియం కిసాన్ యోజన పథకం నగదు బదలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ధవళేశ్వరం లోని పునరావాస కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టరు మాధవీలత తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా సీయం జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అండగా ఉంటూ వారికి ఆర్ధిక భరోసాను కల్పిస్తూ ఆదుకుంటున్నారన్నారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 13,500/- చొప్పున అందించే క్రమంలో ప్రస్తుత 2023-24 సంవత్సరానికి తొలి విడతగా రూ.7500 లను రైతుల ఖాతాలకు రైతు భరోసా జమ చేసామన్నారు. గతంలో ప్రకృతి విపత్తులకు రైతులు నష్టపోయిన పంట పరిహారం కోసం కేంద్రానికి లేఖ వ్రాసి అరకొర నిధులు మాత్రమే ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చేవారని, నేడు సీయం జగన్ మోహన్ రెడ్డి పంట నష్టం జరిగిన తక్షణమే అధికారులను పంపి అక్కడకక్కడ పంట నష్టాన్ని లెక్కించి పరిహారాన్ని అదేసీజన్ లో అందిస్తున్నామన్నారు. స్వర్గీయ వైఎస్. రాజశేఖరరెడ్డి రైతులకు ఎంతో మేలుచేసారని ఆయన తనయుడుగా వారి భాటలోనే సీయం నడుస్తూ అంతకు రెండింతలు రైతులు మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేడు వ్యవసాయం పండుగగా రైతులు ఆనందంగా చేస్తున్నారని మంత్రి తెలిపారు.
హోమంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వ్యవసాయం పండుగలా చేస్తూ భరోసాను కల్పించారన్నారు. రైతులకు వ్యవసాయంలో అన్ని మెలకువలు తెలియజేసేందుకు, వారి గ్రామాల్లోనే ఆర్బీకేలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు జిల్లా వ్యాప్తాంగా రైతులు భరోసా కల్పిస్తూ ఇటీవల జరిగిన పంట నష్టానికి సంబందించి ఇన్ ఫుట్ సబ్సిడీని 60 రోజుల్లోనే రైతులకు జమ చేసిన ఘనత సీయం జగనన్నకు దక్కిందన్నారు. ఇటీవల 2023 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ, హార్టికల్చర్ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ రంగం లోని 577 మంది రైతులకు చెందిన 331.34 హెక్టర్ల పంట నష్టం కింద రూ.46.83 లక్షలు , హార్టికల్చర్ రైతాంగానికి చెందిన 475 హెక్టార్ల పంట నష్టం కింద రూ.55.37 లక్షలు నేడు నగదు బదలీ చేసామన్నారు.
జిల్లా కలెక్టరు డా. మాధవీలత మాట్లాడుతూ నియోజక వర్గాల వారీగా జమ చేసిన రైతు భరోసా – పిఎం కిసాన్ యోజన ద్వారా అనపర్తి మండలం 20,792 మంది రైతుల ఖాతాలో రూ.15.59 కోట్లు, రాజానగరం పరిధిలో 30,470 మంది రైతుల ఖాతాలో రూ.22.85 కోట్లు , రాజమహేంద్ర వరం రూరల్ పరిధిలో 7,452 మంది రైతుల ఖాతాలో రూ.5.59 కోట్లు, జగ్గంపేట నియోజక వర్గం గోకవరం మండలం 10,808 మంది రైతుల ఖాతాలో రూ.8.11 కోట్లు, గోపాలపురం పరిధిలో 26,871 మంది రైతుల ఖాతాలో రూ.20.15 కోట్లు, కొవ్వూరు పరిధిలో 17,468 మంది రైతుల ఖాతాలో రూ.13.10 కోట్లు, నిడదవోలు పరిధిలో 22,006 మంది రైతుల ఖాతాలో రూ.16.50 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు, సభ్యులు కె. తేజ, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, హార్టికల్చర్ అధికారి, వి. రాధాకృష్ణ, మైక్రోఇరిగేషన్ అధికారి రామ్మోహన్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News